విశాఖలో ‘రాకాస’ సందడి | - | Sakshi
Sakshi News home page

విశాఖలో ‘రాకాస’ సందడి

Mar 23 2026 7:02 AM | Updated on Mar 23 2026 7:02 AM

డాబాగార్డెన్స్‌: నిహారిక కొణిదెల నిర్మాతగా, సంగీత్‌ శోభన్‌, నయన్‌ సారిక జంటగా నటించిన ‘రాకాస’ చిత్రం ఏప్రిల్‌ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఆదివారం నగరంలోని ఒక హోటల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చిత్ర యూనిట్‌ పాల్గొంది. ఈ సందర్భంగా నిర్మాత నిహారిక మాట్లాడుతూ ‘కమిటీ కుర్రాళ్లు’ వంటి భారీ విజయం తర్వాత తమ పింక్‌ ఎలిఫెంట్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై వస్తున్న మరో వైవిధ్యమైన చిత్రం ఇదని ధీమా వ్యక్తం చేశారు. విశాఖ బీచ్‌ అంటే తనకు ఎంతో ఇష్టమని, ఇక్కడికి షిఫ్ట్‌ అయిపోవాలని కూడా అనుకుంటానని ఆమె చమత్కరించారు. చిత్రంలో కామెడీ చాలా సహజంగా ఉంటుందని, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి వంటి సీనియర్ల రాకతో సినిమా స్థాయి పెరిగిందని పేర్కొన్నారు. హీరో సంగీత్‌ శోభన్‌ మాట్లాడుతూ ఇది హర్రర్‌ థ్రిల్లర్‌ అంశాలతో కూడిన ఫాంటసీ కామెడీ చిత్రమని, విఠలాచార్య సినిమాల తరహాలో ఒక చందమామ కథను విన్న అనుభూతిని కలిగిస్తుందని తెలిపారు.

హీరోయిన్‌ నయన్‌ సారిక సినిమా ప్రమోషన్స్‌ విశాఖ నుంచి ప్రారంభించడంపై సంతోషం వ్యక్తం చేయగా, గెటప్‌ శ్రీను చిత్రంలోని ఫాంటసీ కామెడీ బాగా పండిందని వివరించారు. పిల్లలు, పెద్దలు అందరూ కలిసి ఎంజాయ్‌ చేసేలా ఈ క్యూట్‌ లవ్‌స్టోరీని తెరకెక్కించినట్లు చిత్ర యూనిట్‌వెల్లడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement