కొమ్మాది: దర్శకుడు సుధీర్ వర్మ తెరకెక్కిస్తున్న హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా చిత్రీకరణ మూడవ రోజు ఉత్సాహంగా సాగింది. ఇందులో ప్రముఖ నటి కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఆదివారం ఆర్కే బీచ్, హవామహల్, ఫిషింగ్ హార్బర్ ప్రాంతాల్లో కిడ్నాప్‌కు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించారు. కాజల్ అగర్వాల్‌ను చూసేందుకు అభిమానులు, పర్యాటకులు భారీగా తరలిరావడంతో ఆమె వారికి అభివాదం చేశారు. కాజల్‌తో పాటు అజయ్ ఘోష్ షూటింగ్‌లో పాల్గొన్నారు. మరో వారం రోజుల పాటు బీచ్ పరిసర ప్రాంతాల్లోనే షూటింగ్ కొనసాగుతుందని చిత్ర యూనిట్ తెలిపింది.


