చందనోత్సవానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

చందనోత్సవానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు

Mar 20 2026 7:50 AM | Updated on Mar 20 2026 7:50 AM

ఏర్పాట్లను పరిశీలించిన సీపీ శంఖబ్రత బాగ్చి

సింహాచలం : వచ్చే నెల 20న జరిగే శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి చందనోత్సవాన్ని దృష్టిలో ఉంచు కుని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సీపీ శంఖబ్రత బాగ్చి అధికారులకు సూచించారు. గురువారం సింహగిరిపై జరుగుతున్న ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈవో జె.వెంకటరావు, ఇంజనీరింగ్‌ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి పలు సూచన లు చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని క్యూల ను క్రమబ ద్ధీకరించాలని ఆదేశించారు. రద్దీ నియంత్రణ కోసం కీలక ప్రాంతాల్లో హోల్డింగ్‌ పాయింట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఆర్టీసీ, పోలీస్‌ సిబ్బంది స మన్వయంతో భక్తులకు సౌకర్యవంతమైన ప్రయాణం కల్పించాలని తెలిపారు. ఘాట్‌ రోడ్డు నుంచి కొండపై, పార్కింగ్‌ ప్రాంతాల వరకు ట్రాఫిక్‌ నియంత్రణకు ప్రత్యేక ప్రణాళిక అమలు చేయనున్నట్లు తెలిపారు.

24న మంత్రుల సమీక్ష : చందనోత్సవం నిర్వహణపై ఈ నెల 24న జిల్లా ఇన్‌చార్జి మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి, దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఈసారి సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పెద్దపీట వేస్తామని, పక్కా ప్రణాళికతో ఉత్సవాన్ని జరిపిస్తామని పేర్కొన్నారు. ఈనెల 29న జరిగే స్వామివారి వార్షిక కల్యాణోత్సవాన్ని కూడా విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఉగాది సందర్భంగా గురువారం సింహగిరిపై స్వామిని దర్శించుకున్న గంటా, పెళ్లిరాట ఉత్సవంలో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement