పెదగంట్యాడ : జాతీయ స్థాయిలో అత్యున్నత సాంకేతిక విద్యా సంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించిన గేట్ – 2026 పరీక్షలో జీవీఎంసీ 75వ వార్డు అయ్యన్నపాలేనికి చెందిన గొందేశి ఆదిత్య యశ్వంత్ ప్రతిభ కనబరిచాడు. గురువారం విడుదలైన ఫలితాల్లో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ విభాగంలో జాతీయ స్థాయిలో 10వ ర్యాంక్ సాధించాడు. ప్రస్తుతం యశ్వంత్ ఐఐటీ కాన్పూర్‌లో ఎంటెక్ చివరి సంవత్సరం చదువుతున్నాడు. చదువుకుంటూనే క్రమశిక్షణతో గేట్ పరీక్షకు సిద్ధమై, అందరి అంచనాలను నిజం చేస్తూ ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌లో టాప్ ర్యాంక్ కై వసం చేసుకున్నాడు. యశ్వంత్ సాధించిన ఈ విజయం పట్ల కుటుంబ సభ్యులు, స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా యశ్వంత్ తండ్రి పైడిరెడ్డి ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు.


