సచివాలయ కమిటీలను త్వరితగతిన పూర్తి చేయండి
మహారాణిపేట: పార్టీ సచివాలయ కమిటీలను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని వైఎస్సార్ సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు పిలుపునిచ్చారు. బుధవారం పార్టీ కార్యాలయంలో ఆయన ఆధ్వర్యంలో జిల్లా ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ విభాగం కమిటీ, 53వ వార్డు ముఖ్య నాయకులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఆదేశాల మేరకు అన్ని నియోజకవర్గాల్లో పెండింగ్‌లో ఉన్న వార్డు, గ్రామ సచివాలయ కమిటీలను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. కమిటీలు పూర్తయితే డిజిటలైజేషన్ ప్రక్రియ కూడా వేగవంతమవుతుందన్నారు. జిల్లా వ్యాప్తంగా అనుబంధ విభాగాలు, వార్డు కమిటీల సభ్యులతో సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో తూర్పు సమన్వయకర్త మొల్లి అప్పారావు, జిల్లా ఇంటిలెక్చువల్ విభాగం జిల్లా అధ్యక్షుడు దేవరకొండ మార్కండేయులు, విశాఖ జిల్లా ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ విభాగం అధ్యక్షుడు చుక్క పైడి రాజురెడ్డి, 53వ వార్డు కార్పొరేటర్ భర్కత్ అలీ, వార్డు అధ్యక్షుడు గుజ్జు వెంకటరెడ్డి, వార్డు పరిశీలకులు యడ్ల శ్రీనివాసరెడ్డి, ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ జిల్లా కమిటీ సభ్యులు రాఘవులు, లోకనాథం, జగజీవన్ రావు, చుక్క అప్పలస్వామి, చుక్క అప్పారావు, రోజాకుమారి, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ విభాగం సమావేశంలో కేకే రాజు


