తాటిచెట్లపాలెం: ప్రయాణికుల సౌకర్యార్థం పలు స్టేషన్‌ల మధ్య వీక్లీ స్పెషల్ రైళ్లను నడుపుతున్నట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డీసీఎం కె.పవన్‌కుమార్ తెలిపారు. చర్లపల్లి–భువనేశ్వర్ న్యూ(07165) స్పెషల్ ఎక్స్‌ప్రెస్ మార్చి 2 నుంచి 30వ తేదీ వరకు ప్రతి రోజూ సాయంత్రం 6.10 గంటలకు చర్లపల్లిలో బయల్దేరుతుంది. ఇది మరుసటి రోజు ఉదయం 9.15 గంటలకు దువ్వాడ చేరుకుని, అక్కడి నుంచి 9.17గంటలకు బయల్దేరుతుంది. భువనేశ్వర్ న్యూ–చర్లపల్లి (07166) రైలు మార్చి 3 నుంచి 31వ తేదీ వరకు నడుస్తుంది. ఇది భువనేశ్వర్ న్యూలో ప్రతి రోజూ సాయంత్రం 6.30 గంటలకు బయల్దేరి, మరుసటి రోజు తెల్లవారుజామున 3.53 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడి నుంచి 3.55 గంటలకు బయల్దేరుతుంది.
● చైన్నె ఎగ్మోర్– సంత్రగచ్చి (06077) వీక్లీ ఎక్స్‌ప్రెస్ ఈ నెల 28 నుంచి మార్చి 14 వరకు నడుస్తుంది. ఇది ప్రతి శనివారం రాత్రి 10.45 గంటలకు చైన్నె ఎగ్మోర్‌లో బయల్దేరి, మరుసటి రోజు మధ్యాహ్నం 2 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడి నుంచి 2.02 గంటలకు బయల్దేరుతుంది. సంత్రగచ్చి–చైన్నె ఎగ్మోర్ (06078) రైలు మార్చి 2 నుంచి 16 వరకు నడుస్తుంది. ఇది ప్రతి సోమవారం ఉదయం 9 గంటలకు సంత్రగచ్చిలో బయల్దేరి, మరుసటి రోజు తెల్లవారుజామున 1.48 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడి నుంచి 1.50 గంటలకు బయల్దేరుతుంది.
● చైన్నె సెంట్రల్–బరౌని (06039) రైలు ఫిబ్రవరి 22 నుంచి మార్చి 3 వరకు నడుస్తుంది. ప్రతి ఆదివారం రాత్రి 11.50 గంటలకు చైన్నె సెంట్రల్‌లో బయల్దేరి, సోమవారం మధ్యాహ్నం 2.50 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడి నుంచి 2.55 గంటలకు బయల్దేరుతుంది. బరౌని–చైన్నె సెంట్రల్ (06040) రైలు ఫిబ్రవరి 25 నుంచి మార్చి 11 వరకు నడుస్తుంది. ప్రతి బుధవారం రాత్రి 9 గంటలకు బరౌనిలో బయల్దేరి, శుక్రవారం తెల్లవారుజామున 2.30 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడి నుంచి 2.35 గంటలకు బయల్దేరుతుంది.
● సికింద్రాబాద్–నహర్‌లగున్ (07046) స్పెషల్ ఎక్స్‌ప్రెస్ ఈ నెల 27న ఉదయం 8.30 గంటలకు సికింద్రాబాద్‌లో బయల్దేరుతుంది. అదే రోజు రాత్రి 9.13 గంటలకు దువ్వాడ చేరుకుని, 9.15 గంటలకు బయల్దే రుతుంది. నహర్‌లగున్–సికింద్రాబాద్ (07047) రైలు మార్చి 2న మధ్యాహ్నం 1 గంటకు నహర్‌లగున్‌లో బయల్దేరుతుంది. గురువారం ఉదయం 8.15 గంటలకు దువ్వాడ చేరుకుని, 8.17 గంటలకు బయల్దే రుతుంది.


