మిలాన్, ఐఎఫ్‌ఆర్ భద్రతపై సీపీ సమీక్ష
విశాఖ సిటీ/ఏయూ క్యాంపస్ : అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ, మిలాన్–2026 నేపథ్యంలో నగరంలో నిర్వహిస్తున్న భద్రతా ఏర్పాట్లను నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి బుధవారం సమీక్షించారు. పార్క్ హోటల్ నుంచి నేవల్ కోస్టల్ బ్యాటరీ వరకు జరిగిన ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ రిహార్సల్స్‌ను ప్రత్యక్షంగా పరిశీలించి బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణపై అధికారులకు సూచనలు చేశారు. హోల్డింగ్, కట్‌ఆఫ్ పాయింట్లు, బీచ్ ఎంక్లోజర్లు, పార్కింగ్ ప్రాంతాలను తనిఖీ చేసిన అనంతరం కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌ను సందర్శించారు. సీసీటీవీ, బాడీ వార్న్ కెమెరాలు, ఈ–పాత్ యాప్, యూహెచ్‌ఎఫ్ వ్యవస్థ, డ్రోన్లు, సోషల్ మీడియా డెస్క్‌ల పనితీరును సమీక్షించారు. రిహార్సల్స్ అనంతరం ముఖ్య కూడళ్లలో ట్రాఫిక్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భద్రతా పరంగా ప్రజలు, పర్యాటకులు పోలీసులకు సహకరించాలని, అనుమానాస్పద పరిస్థితులు గమనిస్తే 79950 95799 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని సీపీ సూచించారు.


