రాష్ట్రపతికి వీడ్కోలు | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రపతికి వీడ్కోలు

Feb 19 2026 10:07 AM | Updated on Feb 19 2026 10:07 AM

రాష్ట

రాష్ట్రపతికి వీడ్కోలు

మహారాణిపేట: ఇంటర్నేషనల్‌ ఫ్లీట్‌ రివ్యూ(ఐఎఫ్‌ఆర్‌)లో పాల్గొన్న అనంతరం, భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం తిరుగు ప్రయాణమయ్యారు. ఈ సందర్భంగా నేవల్‌ ఎయిర్‌ స్టేషన్‌లో ఆమెకు గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, జిల్లా ఇన్‌చార్జి మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేందిర ప్రసాద్‌, నగర పోలీసు కమిషనర్‌ శంఖబ్రత బాగ్చి, తూర్పు నావికాదళం వైస్‌ అడ్మిరల్‌ రాజేష్‌ పెంధార్కర్‌ తదితరులు ఘనంగా వీడ్కోలు పలికారు. అలాగే, ఐఎఫ్‌ఆర్‌లో పాల్గొన్న అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం మధ్యాహ్నం 1.30 గంటలకు విశాఖపట్నం నుంచి విమాన మార్గంలో విజయవాడకు బయలుదేరారు. విమానాశ్రయంలో అధికారులు సీఎంకు ఘనంగా వీడ్కోలు పలికారు.

రాష్ట్రపతికి వీడ్కోలు1
1/1

రాష్ట్రపతికి వీడ్కోలు

Advertisement
 
Advertisement
Advertisement