నిరుద్యోగ భృతి ఎక్కడ బాబూ?
అధికారంలోకి వస్తే 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు అండ్ కో హామీలతో ఊదరగొట్టారు. ఉద్యోగాలు వచ్చేవరకూ నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చి యువత ఓటుతో గెలుపొందారు. ప్రభుత్వం ఏర్పడి దాదాపు రెండేళ్లు కావస్తోంది. ఉద్యోగ కల్పన లేదు..నిరుద్యోగ భృతి లేదు. నిరుద్యోగ భృతికి బడ్జెట్‌లో నిధులు కేటాయించకపోవడం యువతను మోసగించినట్టే. యువతను ఎందుకు మోసం చేయాలి?
– పీతల సాయిశ్రీ,
నౌరోజీరోడ్డు, మహారాణిపేట
నిరుద్యోగ భృతి ఎక్కడ బాబూ?


