ఇంతలా మోసం చేస్తారనుకోలేదు
ఎన్నికల సమయంలో ఇచ్చిన ‘ఆడబిడ్డ నిధి’ హామీని ప్రభుత్వం వెంటనే అమలు చేయాలి. ప్రతి మహిళకు నెలకు రూ.1,500 ఇస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇన్ని నెలలు గడుస్తున్నా ఈ పథకం అమలుకు నోచుకోలేదు. ఈ పథకం అమలు కాకపోవడం వల్ల ఒక్కో మహిళ ఇప్పటి వరకు దాదాపు రూ.30,000 వరకు ఆర్థికంగా నష్టపోయారు. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కూడా ఈ పథకానికి నిధుల కేటాయింపులు జరగలేదు. ఇది మహిళలను మోసం చేయడమే. చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. అలాంటప్పుడు ఎందుకు హామీలు ఇవ్వడం.
–దువ్వి రాములమ్మ, అన్నవరం,భీమిలి నియోజకవర్గం


