పోర్టు సెక్రటరీగా శంకర్‌బాబు
సాక్షి, విశాఖపట్నం : మేజర్ పోర్టులతో పోటీ పడుతున్న విశాఖపట్నం పోర్టు అథారిటీ(వీపీఏ)లో జరుగుతున్న కార్యకలాపాలు సజావుగా పూర్తయ్యేలా బాధ్యతగా వ్యవహరిస్తానని పోర్టు సెక్రటరీ ఎం శంకర్‌బాబు అన్నారు. విశాఖపట్నం పోర్ట్ అథారిటీ కార్యదర్శిగా ఎం. శంకర్ బాబు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. మూడు నెలల క్రితం గతంలో పనిచేసిన సెక్రటరీ వేణుగోపాల్ డిప్యూటీ చైర్మన్‌గా పదోన్నతి పొందుతూ పారాదీప్ పోర్టుకు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో కేంద్ర పోర్టులు నౌకా జల రవాణా శాఖ మంత్రిత్వ శాఖ శంకర్‌బాబుని నియమించింది. విశాఖపట్నం పోర్ట్‌కు రాక పూర్వం ఆయన గోవా పోర్టు కార్యదర్శిగా సేవలందించారు. వీపీఏ డిప్యూటీ చైర్‌పర్సన్ రోష్ని అపరంజి కొరాటిని మర్యాదపూర్వకంగా కలిశారు. బాధ్యతలు స్వీకరించిన శంకర్‌బాబుకు పోర్ట్ విభాగాధిపతులు, ఉన్నతాధికారులు, సిబ్బంది స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు.


