బస్సు ఢీకొని జూ పార్కు కాంట్రాక్ట్ కార్మికుడి మృతి
ఆరిలోవ: ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తమ్మినేని మోహనరావు (45)మృతి చెందాడు. కంచరపాలేనికి చెందిన మోహనరావు జూ పార్కులో కాంట్రాక్ట్ పనులు చేస్తుండగా, సోమవారం తెల్లవారుజామున ద్విచక్రవాహనంపై పనికి వెళ్తుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. తలకు తీవ్ర గాయమై మోహనరావు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించి, మృతుడి కుమారుడి సాయి మణికంఠ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ వరహాలునాయుడు తెలిపారు.


