ఆకట్టుకుంటున్న ‘వసుంధర’ నగల మేళా
ఏయూక్యాంపస్: వివాహ శుభకార్యాలకు మరింత శోభను చేకూర్చేలా ‘వసుంధర’ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆభరణాల ఎగ్జిబిషన్ నగరవాసులను విశేషంగా ఆకట్టుకుంటోంది. స్థానిక వెల్కమ్ గ్రాండ్ బే హోటల్‌లో మంగళవారం ప్రారంభమైన ఈ రెండు రోజుల బంగారు, వజ్రాల నగల ప్రదర్శనను ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైవిధ్యమైన, నూతన డిజైన్లతో కూడిన ఈ ప్రదర్శన విశాఖ వాసులకు మంచి అవకాశమని కొనియాడారు. సంస్థ వ్యవస్థాపకురాలు వసుంధర కాసరనేని మాట్లాడుతూ.. విశాఖలో తమ ఆభరణాలకు ఎప్పుడూ మంచి ఆదరణ లభిస్తుందని తెలిపారు. ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించిన ప్రత్యేక కలెక్షన్ల గురించి సంస్థ ఉపాధ్యక్షురాలు, విశాఖ బ్రాంచ్ అధిపతి శ్రీదేవి తొట్టెంపూడి వివరించారు. వందలాది వినూత్న డిజైన్లు, మెరిసే వజ్రాల నగల కలెక్షన్ మగువులను మంత్రముగ్ధులను చేస్తోంది. తొలిరోజే పెద్ద సంఖ్యలో మహిళలు విచ్చేసి తమకు నచ్చిన ఆభరణాలను ఆసక్తిగా కొనుగోలు చేశారు. బుధవారం కూడా ఈ ప్రదర్శన కొనసాగనుంది.


