ఉత్సవ్‌భరితంగా..
ఏయూక్యాంపస్: విశాఖ ఉత్సవ్ రెండో రోజు వేడుకలు ఉత్సాహభరితంగా సాగాయి. బీచ్‌రోడ్డులోని గోకుల్‌పార్క్, ఆర్కే బీచ్ వేదికలపై ఏర్పాటు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు పర్యాటకులను, నగరవాసులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆదివారం సెలవు దినం కావడంతో వేల సంఖ్యలో ప్రజలు సముద్ర తీరానికి తరలి రావడంతో విశాఖ తీరం జనసాగరాన్ని తలపించింది. గోకుల్‌పార్క్ వేదికపై కుసుమ హరనాథ్ డ్యాన్స్ అకాడమీ వారు ప్రదర్శించిన ‘శ్రీనివాస కల్యాణం’ నృత్య రూపకం ఆహూతులను మంత్రముగ్ధులను చేసింది. చిన్నారులు తమ నాట్య ప్రతిభతో వేదికపై సందడి చేయగా, ఇంద్రజాలికుడు రామ్ ప్రదర్శించిన మాయాజాలం పిల్లలను అమితంగా అలరించింది. పవర్ బోర్డ్‌పై చేసిన వినూత్న నృత్యం, ‘మహా కనకదుర్గ.. విజయదుర్గ’ అంటూ సాగి న శాసీ్త్రయ నృత్య ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సూపర్ సింగర్ గాయకుల సంగీత విభావరీ, సెలబ్రిటీ సింగర్ల గళం ఉత్సవ్‌లో జోష్ నింపగా, ‘యుఫోరియా’ చిత్ర బృందంతో పాటు దర్శకుడు గుణశేఖర్, నటి భూమిక ఈ వేడుకల్లో పాల్గొని సందడి చేశారు. ఉత్సవ్‌లో భాగంగా ఏర్పాటు చేసిన ఫుడ్ స్టాల్స్ వద్ద నగరవాసుల సందడి నెలకొంది. విభిన్న రుచులను ఆస్వాదించేందుకు ప్రజలు క్యూ కట్టారు. చల్లని సాయంత్రం కుటుంబ సమేతంగా వచ్చిన పర్యాటకులు రుచికరమైన ఆహారాన్ని భుజిస్తూ వేడుకలను వీక్షించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి తదితరులు పాల్గొని పర్యవేక్షించారు. కామాక్షి వయోలిన్ కచేరీలో పలికించిన మధుర స్వరాలు శ్రోతలను పరవశింపజేయగా, అనంతరం సాగిన డీజే సందడి యువతకు సరికొత్త అనుభూతిని అందించింది. వర్ష బృందం నృత్యాలు అలరించాయి. అయితే ఈసారి ఉత్సవ్‌లో స్టార్ హోటళ్ల స్టాల్స్ లేకపోవడం ఆహార ప్రియులను కొంత నిరాశకు గురిచేసింది. అలాగే ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన నమూనా ఆలయాలలో సింహాచలం వరాహ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ నమూనాను కూడా ఏర్పాటు చేసి ఉంటే బాగుండేదని పలువురు సందర్శకులు అభిప్రాయపడ్డారు. జనసందోహం భారీగా పెరగడంతో ఆల్ ఇండియా రేడియో జంక్షన్ మీదుగా రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది, ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడానికి పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఇదే సమయంలో ఉత్సవంలో తప్పిపోయిన పలువురు చిన్నారులను పోలీసులు సమయస్ఫూర్తితో గుర్తించి క్షేమంగా తల్లిదండ్రుల చెంతకు చేర్చారు.
ఉత్సవ్‌భరితంగా..
ఉత్సవ్‌భరితంగా..
ఉత్సవ్‌భరితంగా..


