సాయుధ దళాల మధ్య సమన్వయమే లక్ష్యం
సింథియా: విశాఖ తూర్పు నావికాదళ కమాండ్‌ను ఆర్మీ ట్రైనింగ్ కమాండ్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్, లెఫ్టినెంట్ జనరల్ దేవేంద్ర శర్మ సందర్శించారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన తూర్పు నావికాదళ కమాండ్ ప్రతినిధి వైస్ అడ్మిరల్ సంజయ్ భల్లాతో సమావేశమై, సాయుధ దళాల మధ్య అంతర్–సేవల సమన్వయాన్ని పటిష్టం చేయడం , సమగ్ర శిక్షణా విధానాలపై కీలక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా లెఫ్టినెంట్ జనరల్ దేవేంద్ర శర్మకు తూర్పు నావికాదళ ప్రధాన కార్యాలయం వద్ద కమాండ్ యొక్క కార్యకలాపాలను వివరించారు. ‘సన్‌రైజ్ కమాండ్’ కార్యాచరణ సామర్థ్యం, వ్యూహాత్మక నిబద్ధతలు, ప్రస్తుతం కొనసాగుతున్న కీలక మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్యక్రమాల గురించి అధికారులు ఆయనకు సమగ్రంగా వివరించారు. ఆధునిక యుద్ధ తంత్రాలకు అనుగుణంగా శిక్షణలో తీసుకురావాల్సిన నూతన మార్పుల గురించి ఈ సమావేశంలో ఇద్దరు ఉన్నతాధికారులు అభిప్రాయాలను పంచుకున్నారు.


