కర్మాగారం!
కారాగారమే
జైలులోని వ్యవసాయ క్షేత్రంలో పనులు చేస్తున్న ఖైదీలు
విశాఖ
జైలులో
పారిశ్రామిక
ప్రగతి
విశాఖ కేంద్ర కారాగారంలోని కర్మాగారాలు ఇప్పుడు ఉత్పత్తిలో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. జైళ్ల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పరిశ్రమల్లో ఖైదీలే కార్మికులుగా మారి, నాణ్యమైన వస్తువులను తయారు చేస్తున్నారు. జైళ్ల శాఖ ఇక్కడ పరిశ్రమల ద్వారా ఖైదీలకు చేతినిండా పని కల్పించి, ఆదాయ మార్గాన్ని చూపిస్తోంది. ఇక్కడ కొబ్బరి చీపుర్ల నుంచి ఇంట్లో వినియోగించే కుర్చీలు, టేబుళ్లు, కార్యాలయాల్లో వాడే ఇనుప బీరువాల వరకు అన్నీ తయారవుతున్నాయి. వ్యవసాయం, పాడి పరిశ్రమ, స్టీలు పరికరాల తయారీ, బుక్ బైండింగ్, చేనేత వస్త్రాలు, బేకరీ తదితర పరిశ్రమలు ఇక్కడ ఉన్నాయి. వీటన్నింటినీ ఇక్కడ ఉన్న జీవిత, జీవితేతర ఖైదీలే తయారుచేస్తున్నారు. వారు జైల్లో శిక్ష అనుభవిస్తున్నప్పటికీ, ఆదాయార్జనలో నిమగ్నమయ్యే అవకాశాన్ని జైలు అధికారులు కల్పిస్తున్నారు. ఆరోగ్యకరమైన పంటలు పండించడంలో, నాణ్యమైన వస్తువులు తయారు చేయడంలో తాము బయట పనిచేసే కార్మికులకు ఏమాత్రం తీసిపోమని వారు నిరూపిస్తున్నారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో కేవలం 9 నెలల కాలంలోనే రూ.1.33 కోట్ల విలువైన ఉత్పత్తులను తయారు చేసి ఔరా అనిపించారు. ఇక్కడ తయారైన వస్తువులను జైలు అవసరాలకు వినియోగించడంతో పాటు, మిగిలిన వాటిని బయట మార్కెట్‌లోనూ, రాష్ట్రంలోని ఇతర జైళ్లకు విక్రయిస్తున్నారు.
సింహభాగం స్టీల్‌దే..
జైలులో నడుస్తున్న పరిశ్రమల్లో స్టీల్ ప్లాంట్‌ది అగ్రస్థానం. ఇక్కడ ఇనుప బీరువాలు, ఆఫీసు సామగ్రి, కుర్చీలు, టేబుళ్లు వంటివి తయారవుతున్నాయి. 2024–25లో రూ.1.71 కోట్ల విలువైన స్టీల్ ఉత్పత్తులు జరగగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గడిచిన 9 నెలల్లో రూ.85 లక్షల మేర ఉత్పత్తి జరిగింది.
వీటితో పాటు కొబ్బరి చీపుర్లు, బుక్ బైండింగ్, రకరకాల పంటల సాగుతో జైలు కళకళలాడుతోంది. సుమారు 200 మంది జీవిత, జీవితేతర ఖైదీలు ఈ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. శిక్ష కాలంలో ఖైదీలు చేసే పనికి జైలు అధికారులు వేతనాలు చెల్లిస్తారు. ఈ మొత్తాన్ని వారు విడుదలయ్యే సమయంలో అందజేస్తారు. ఈ డబ్బు వారి కొత్త జీవితానికి, ఉపాధికి పెట్టుబడిలా మారుతుంది. అంతేకాకుండా, జైలులో ఉంటూనే తమ కుటుంబాలకు ఆర్థికంగా ఆసరాగా నిలిచే వెసులుబాటు కూడా కలుగుతోంది.
వివిధ విభాగాల వారీగా 9 నెలల ఆదాయం/ఉత్పత్తి స్టీల్ యూనిట్ రూ. 85 లక్షలు పాడి పరిశ్రమ రూ. 15.20 లక్షలు బేకరీ యూనిట్ రూ. 13 లక్షలు వీవింగ్ (చేనేత) యూనిట్ రూ. 13 లక్షలు వ్యవసాయం రూ. 3.90 లక్షలు జైలు షాపు రూ. 2.50 లక్షలు
ఖైదీలకు
బతుకుపై
భరోసా
అది విశాఖపట్నం కేంద్ర కారాగారం. నేరస్తులకు శిక్ష అమలు చేసే ఈ ప్రాంగణం.. ఇప్పుడు పారిశ్రామిక ప్రగతికి వేదికగా మారుతోంది. నాలుగు గోడల మధ్య మగ్గిపోకుండా.. ఖైదీలు తమలోని నైపుణ్యానికి పదును పెడుతున్నారు. ఒక చేత్తో వ్యవసాయం, మరో చేత్తో ఉక్కు పరికరాలు తయారు చేస్తూ.. ‘మేము ఖైదీలం మాత్రమే కాదు, కష్టజీవులం’ అని నిరూపిస్తున్నారు. విశాఖ సెంట్రల్ జైలులో నిర్వహిస్తున్న వివిధ పరిశ్రమల ద్వారా ఏటా కోట్ల రూపాయల విలువైన ఉత్పత్తులు తయారవుతుండగా, ఖైదీలకు ఉపాధితో పాటు భవిష్యత్తుపై భరోసా లభిస్తోంది. – ఆరిలోవ
మార్పు కోసమే ఈ ప్రయత్నం
ఖైదీలలో పరివర్తన తీసుకురావడమే మా ప్రధాన లక్ష్యం. ఇక్కడి పరిశ్రమల ద్వారా వారికి ఆదాయంతో పాటు పని నేర్పించి, విడుదలయ్యాక సమాజంలో గౌరవంగా బతికేలా తీర్చిదిద్దుతున్నాం. ప్రస్తుతం స్టీల్, పాడి, బేకరీ విభాగాల నుంచి మంచి ఆదాయం వస్తోంది. ఉత్పత్తులను మరింత పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
– ఎం. మహేష్‌బాబు, పర్యవేక్షణాధికారి,
విశాఖ కేంద్రకారాగారం
కర్మాగారం!
కర్మాగారం!
కర్మాగారం!
కర్మాగారం!


