గీత కులాలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

గీత కులాలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలి

Jan 5 2026 7:25 AM | Updated on Jan 5 2026 7:25 AM

గీత కులాలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలి

గీత కులాలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలి

● కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్‌

ఆరిలోవ: గీత కులాలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్‌ అన్నారు. విశాఖ అర్బన్‌ గీత కులాల ఆహ్వానం కమిటీ ప్రతినిధులు అప్పారి గిరిబాబు, సింహాచలం బోర్డు మాజీ సభ్యుడు సంపంగి శ్రీను ఆధ్వర్యంలో ముడసర్లోవ పార్కులో ఆదివారం ఘనంగా నిర్వహించిన వన సమారాధన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సుమారు 30 వేల మందికి పైగా తరలివచ్చిన గీత కులాల సంఘ నాయకులు, ప్రతినిధులుతో వేదిక కళకళలాడింది. పెద్ద ఎత్తున హాజరై తమ సంఖ్యా బలాన్ని చాటుకున్నాయి. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో 25 శాతం మంది గీత కులాల వారు ఉన్నారని, గీత కులస్తుల ఐక్యత కోసం, హక్కులు సాధించుకోవడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం గీత కులాల అభ్యున్నతికి కట్టుబడి ఉందన్నారు. ఈ వన సమారాధన వేదిక గీత కులాల వారి భవిష్యత్తు, అభివృద్ధికి దిశ, నిర్దేశం అవుతుందని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష మాట్లాడుతూ గీత కులస్తులు సామాజిక, రాజకీయ రంగాలలో ముందుండే విధంగా ప్రణాళికలు వేసుకోవాలని సూచించారు. శాసనమండలి మాజీ డిప్యూటీ స్పీకర్‌ రెడ్డి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ప్రమాదవశాత్తూ తాటిచెట్టు పైనుంచి పడి మృతి చెందిన గీత కార్మికులకు గతంలో రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇచ్చేవారని దానిని పునరుద్ధరించాలని కోరారు. వనసమారాధనలో రాష్ట్ర బీసీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఆర్‌.అనంత కుమారి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్‌, విశాఖ ఎంపీ భరత్‌, ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, వంశీకృష్ణ శ్రీనివాస్‌, విష్ణుకుమార్‌ రాజు, పంచకర్ల రమేష్‌బాబు, గణబాబు, మేయర్‌ పీలా శ్రీనివాస్‌, వీఎంఆర్‌డీఏ చైర్మన్‌ ప్రణవ్‌ గోపాల్‌ తదితరులు పాల్గొని గీత కులాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో శెట్టిబలిజ కార్పొరేషన్‌ చైర్మన్‌ కుడుపూడి సత్తిబాబు, గౌడ కార్పొరేషన్‌ చైర్మన్‌ వీరంకి వెంకట గురుమూర్తి, కార్పొరేటర్‌ అప్పారి శ్రీ విద్య, శెట్టిబలిజ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ అనసూరి మధు, యాత సంక్షేమ సంఘం రాష్ట్ర, జిల్లా నాయకులు అంగటి రాము, రేఖలకృష్ణ గౌడ్‌, కొప్పిశెట్టి కనక శేఖర్‌, కట్టా మల్లేశ్వరావు, పినగాడి సర్పంచ్‌ కేసుబోయిన త్రినాథ్‌, బొమ్మిడి రమణ, దొడ్డి కన్నారావు, గుత్తుల వెంకటేశ్వరరావు, గీత కులాల పెద్దలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement