రక్షణగిరిలో నవదిన ప్రార్థనలు
కంచరపాలెం: జ్ఞానాపురంలోని పునీత పేతురు చర్చి ఫాదర్ రెవరెండ్ జొన్నాడ జాన్‌ప్రకాష్, పారిస్ పాస్టిల్ కౌనిల్స్ (పీపీసీ) సంయుక్త ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకల్లో భాగంగా సోమవారం నవదిన ప్రార్థనలు జరిగాయి. విశాఖ ఆర్చి బిషప్ ఉడుముల బాల ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉదయం 4 గంటలకు కొవ్వొత్తులతో జ్ఞానాపురం వీధుల్లో ప్రదక్షిణలు చేశారు. అనంతరం బాబూ కాలనీ, జేఎన్‌ఎన్‌ఆర్‌యూఎం కాలనీల్లో మహిళలు కొవ్వొత్తులతో ప్రదర్శనలు నిర్వహించారు. క్రీస్తు రాక కోసం ప్రజలు భక్తిశ్రద్ధలతో మెలగాలని ఫాదర్లు తెలిపారు. నవ దినాలు జరిగే దీపారాధనల్లో అన్ని గ్రామాల భక్తులు పాల్గొనాలని కోరారు. ప్రసంగాల అనంతరం దివ్యబలి పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ 41వ వార్డు కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ, వార్డు అధ్యక్షుడు కోడిగుడ్ల శ్రీధర్, అలిండియా క్యాథలిక్ యూనియన్ అధ్యక్షుడు బూర శేషుబాబు, పీపీసీ అధ్యక్షుడు రాజేష్, పెద్ద సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు.


