చంద్రబాబు నిర్ణయానికి నిరసనగా పోటెత్తిన జనం కోటి సంతకాల
విశాఖ సిటీ : వైద్య కళాశాలలను పీపీపీ పద్ధతిలో ప్రైవేటుకు అప్పగించాలన్న చంద్రబాబు నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రజాగ్రహం పెల్లుబికింది. పేద విద్యార్థులకు వైద్య విద్య, వైద్యాన్ని దూరం చేసే ప్రభుత్వ పన్నాగంపై కదం తొక్కింది. మెడికల్ కాలేజీలను కార్పొరేట్లకు దోచిపెట్టే దురాలోచనపై దండెత్తింది. చంద్రబాబు ప్రభుత్వ ప్రైవేటు విధానాలకు వ్యతిరేకంగా నిరసన గళమెత్తింది. మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పేదలకు వైద్య విద్య, వైద్య సేవలు అందించాలన్న లక్ష్యంతో రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు, ఆస్పత్రులు నిర్మిస్తే.. వాటిని చంద్రబాబు తన తొత్తులకు కట్టబెట్టే ప్రయత్నాలను లక్షల మంది ప్రజానీకం సంతకాల ద్వారా వ్యతిరేకించారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి సేకరించిన 4,15,500 సంతకాల పత్రాలను కేంద్ర పార్టీ కార్యాలయానికి పంపించే కార్యక్రమానికి కూడా జనం పోటెత్తారు. సోమవారం ఉదయం జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి మద్దిలపాలెం వరకు జరిగిన ఉద్యమ ర్యాలీ వేలాది మంది జనసందోహంతో నిండిపోయింది.
హోరెత్తిన ర్యాలీ
జీవీఎంసీ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహానికి వైఎస్సార్‌సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు, పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం పరిశీలకుడు కదిరి బాబూరావు, ఎమ్మెల్సీలు వరుదు కల్యాణి, పి.రవీంద్రబాబు, నియోజకవర్గాల సమన్వయకర్తలు వాసుపల్లి గణేష్‌కుమార్, మళ్ల విజయ్‌ప్రసాద్, తిప్పల దేవన్‌రెడ్డి, మొల్లి అప్పారావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అక్కడి నుంచి వేలాదిగా తరలివచ్చిన వైఎస్సార్‌సీపీ శ్రేణులు, అభిమానులు, విద్యార్థులు, ప్రజలతో ర్యాలీ బయలుదేరింది. ఒకవైపు కోలాటాలు, కోబ్రా నృత్యాలు, డీజేలతో ఆ ప్రాంతాలు దద్దరిల్లిపోయాయి. సుమారు 2 కిలోమీటర్ల మేర ర్యాలీగా వెళ్లి మద్దిలపాలెం జంక్షన్‌లో తెలుగుతల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం సంతకాల పత్రాల వాహనానికి పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, పార్లమెంట్ నియోజకవర్గం పరిశీలకుడు కదిరి బాబూరావు జెండా ఊపి తాడేపల్లి కేంద్ర కార్యాలయానికి పంపించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు వరుదు కల్యాణి, పండుల రవీంద్రబాబు, సమన్వయకర్తలు మళ్ల విజయ ప్రసాద్, మొల్లి అప్పారావు, తిప్పల దేవన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు తైనాల విజయకుమార్, చింతలపూడి వెంకటరామయ్య, డిప్యూటీ మేయర్ కె.సతీష్, సీఈసీ సభ్యులు కోలా గురువులు, కాయల వెంకటరెడ్డి, మాజీ మేయర్ గొలగాని హరివెంకటకుమారి, పార్టీ ముఖ్య నాయకులు సిరిసహస్ర(సిరిమ్మ), జియ్యాని శ్రీధర్, ఉరుకూటి అప్పారావు, రొంగలి జగన్నాథం, బాణాల శ్రీనివాసరావు, డాక్టర్ సీఎంఏ జహీర్ అహ్మద్, దాట్ల వెంకటఅప్పలప్రసాద్ రాజు, పిన్నమరాజు సతీష్ వర్మ, పోతిన హనుమంతరావు, తాడి జగన్నాథరెడ్డి, కిరణ్‌రాజు, గొండేశి మహేశ్వర రెడ్డి, చెన్నాదాస్, పల్లా దుర్గారావు, కోరుకొండ వెంకటరత్నస్వాతిదాస్, గుడ్ల వెంకటరమణిరెడ్డి, మంచా నాగమల్లీశ్వరి, దుప్పలపూడి శ్రీనివాసరావు, బొల్లవరపు జాన్‌వెస్లీ, పెర్ల విజయ్‌చంద్ర, పిల్లి సుజాత, ద్రోణంరాజు శ్రీవాస్తవ, చెన్నా జానకిరామ్, పిల్లా సుజాత ,గొలగాని శ్రీనివాస్,రవి రాజు, అల్లు శంకర్‌రావు, అక్కరమాని పద్మ, రామునాయుడు, దౌలపల్లి ఏడుకొండల రావు, కటారి అనీల్‌కుమార్, నక్కిల లక్ష్మీ, శాడి పద్మారెడ్డి, బిపిన్ కుమార్ జైన్, గుండాపు నాగేశ్వరరావు, కోడిగుడ్ల పూర్ణిమ, వావిలపల్లి ప్రసాద్, రెయ్యి వెంకటరమణ, బర్కత్ అలీ, కేవీ శశికళ, బల్ల లక్ష్మణ్, మహమ్మద్ ఇమ్రాన్, గుడివాడ సాయిఅనూష, లతీష్, ఉరుకూటి రామచంద్రరావు, భూపతిరాజు సుజాత, సేనాపతి అప్పారావు, ఎండీ షరాఫీ, అంబటి నాగ వినాయక శైలేష్, ముట్టి సునీల్‌కుమార్, తుమ్మలూరి జగదేష్ రెడ్డి, నీలపు కాళిదాస్‌రెడ్డి, పెడాడ రమణికుమారి, బోనిఅప్పలనాయుడు, సనపల రవీంద్రభరత్, బోని శివ రామకృష్ణ, బాజీ నాయుడు, కర్రి రామారెడ్డి, శ్రీదేవి వర్మ, వంకాయల మారుతీప్రసాద్, సకలభక్తుల ప్రసాద్‌రావు, ఆడేపల్లి రవిబాబు, దేవరకొండ మార్కడేయులు, బోండా ఉమామహేశ్వరరావు, జి.నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.


