దుష్ట ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెబుతారు
చంద్రబాబు 14 ఏళ్లు ముఖ్యంగా ఉన్నారు కానీ రాష్ట్రానికి ఒక్క మెడికల్ కాలేజీ తీసుకురాలేకపోయారని విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం పరిశీలకుడు కదిరి బాబూరావు అన్నారు. జగన్ ఒక టర్మ్‌లో రాష్ట్రంలో 17 వైద్య కళాశాలలను నిర్మించారు.. ఇప్పుడు వాటిని పీపీపీ విధానంలో ప్రైవేటుకు అప్పగించాలని చంద్రబాబు నిర్ణయించడం దారుణమన్నారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేస్తే సీట్లను ధనవంతులే కొనుక్కుంటారని తెలిపారు. పేదలకు వైద్య విద్యను దూరం చేయడం దుర్మార్గమని అన్నారు. చంద్రబాబు నిర్ణయం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది.. మాజీ సీఎం పిలుపుతో లక్షల మంది ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు చేయడమే ఇందుకు నిదర్శనమన్నారు. రానున్న రాజుల్లో ప్రజలే చంద్రబాబుకు గట్టి బుద్ధి చెబుతారన్నారు.


