చంద్రబాబు రాష్ట్రాన్ని అమ్మేయాలని చూస్తున్నారు
మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పేదలకు కూడా వైద్య విద్య, వైద్య సేవలు అందించాలన్న సంకల్పంతో రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు, ఆస్పత్రులు నిర్మిస్తే.. చంద్రబాబు మాత్రం వాటిని కార్పొరేట్లకు దోచిపెట్టాలని చూస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్, మాజీ మంత్రి కురుసాల కన్నబాబు మండిపడ్డారు. ప్రజల సొమ్ము, ఆస్తులను ధారాదత్తం చేయడానికి సిగ్గనిపించడం లేదా? అని ప్రశ్నించారు. సీనియార్టీ అంతా ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టడమేనా.. విశాఖ అంటే అంత తేరగా, ఉత్తరాంధ్ర అంత చవకగా కనిపిస్తుందన్నారు. రియల్ ఎస్టేట్ సంస్థలకు అత్తింటి ఆస్తిలాగా అమ్మేస్తూ ఉంటే ప్రజలు చూస్తూ ఉంటారా? విశాఖలో ఎకరం 99 పైసలకు ఇస్తున్న చంద్రబాబు, పేదల ఇళ్లకు గజం రూ.99కి ఇస్తారా? అని ప్రశ్నించారు. 2029లో అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా ఈ కాలేజీలను వెనక్కు తీసుకుని ప్రభుత్వమే నడిపిస్తుందన్నారు. విశాఖలో చారిత్రాత్మక కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని విశాఖలో ఆస్తులు ముట్టుకోవాలనుకున్నా.. ప్రైవేటు వారికి కట్టబెట్టాలనుకున్నా భయపడేలా ఇక్కడున్న ప్రజలు గళమెత్తాలన్నారు.


