2029లో ఆ కాలేజీలను ప్రభుత్వపరం చేస్తాం
చేతకాని దద్దమ్మ చంద్రబాబు సర్కార్ మెడికల్ కాలేజీలు, ఆస్పత్రులను ప్రైవేటుకు అప్పగించాలని నిర్ణయించడం దారుణమని విశాఖ దక్షిణ సమన్వయకర్త వాసుపల్లి గణేష్‌కుమార్ అన్నారు. జగన్ చదువునిచ్చి అందరినీ పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దితే.. చంద్రబాబు మాత్రం యువతను అడుక్కునేలా చేస్తున్నారన్నారు. పేద విద్యార్థులకు జ్ఞానం ఇవ్వాలని జగన్ సంకల్పిస్తే.. చంద్రబాబు వారి నోటి నుంచి చదువును దూరం చేస్తున్నారని వాపోయారు. ఇవి కేవలం ఇంకుతో పెట్టిన సంతకాలు కాదు.. సరిహద్దుల్లో రక్తం చిందించే సైనికుల కంటే విలువైన ఇంకుతో పెట్టిన సంతకాలన్నారు. గవర్నర్ గారు చంద్రబాబుకు బుద్ధి వచ్చేలా చేయండి. 2029లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తప్పకుండా ముఖ్యమంత్రి అవుతారని, ప్రైవేటు చేస్తున్న కాలేజీలన్నింటినీ ప్రభుత్వపరం చేస్తారన్నారు.


