30న అప్పన్న ఉత్తరద్వార దర్శనం
సింహాచలం: ఈనెల 30న ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఉత్తరద్వార దర్శనానికి అన్నిశాఖల సమన్వయంతో ఏర్పా ట్లు చేస్తున్నట్టు దేవస్థానం ఇన్‌చార్జి ఈవో ఎన్.సుజాత తెలిపారు. ఏర్పాట్లపై సోమవారం పలు శాఖల అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. 30న తెల్లవారుజామున ఒంటి గంట నుంచి వైదిక కార్యక్రమాలు ప్రారంభమవుతాయ, ఆరోజు 5.30 నుంచి 11 గంటల వరకు ఆలయ ఉత్తర రాజగోపురంలో వైకుంఠ ద్వార ద్వార దర్శనం భక్తులకు కల్పిస్తామన్నారు. 40 వేల మందికి పైగా భక్తులు ఉత్తర ద్వార దర్శనానికి వస్తారని అంచనా వేసినట్టు తెలిపారు. అన్ని దర్శన క్యూల్లో మంచినీరు అందిస్తామన్నారు. 20 వేల మంది భక్తులకు అన్నప్రసాద భవనంలో పొంగలి, పులుసు ప్రసాదం అందిస్తామన్నారు. భక్తులు ఉత్తర ద్వార దర్శనాన్ని వీక్షించేందుకు సింహగిరిపై రిసెప్షన్ కేంద్రం, కల్యాణం గ్రౌండ్‌ల్లో భారీ ఎల్‌ఈడీ స్క్రీన్‌లు ఏర్పాటుచేస్తామన్నారు. ఈనెల 29 రాత్రి 7 గంటల తర్వాత సింహగిరిపై బస్సులు అనుమతించమని, 30న తెల్లవారుజామున 4 గంటల నుంచి బస్సు సర్వీసులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు నిర్వహిస్తారని తెలిపారు. దేవస్థానం ప్రధానార్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, సీతారామాచార్యులు, డిప్యూటీ ఈవో రాధ, ఈఈ రమణ, ఏసీపీ పృథ్వీతేజ్, గోపాలపట్నం సీఐ ఎల్.ఎస్.నాయుడు, ఆర్టీసీ, మెడికల్ అండ్ హెల్త్, ఎకై ్సజ్, ఫైర్ శాఖల అధికారులు పాల్గొన్నారు.


