చంద్రబాబు అహంకారాన్ని ప్రజలే దించుతారు
మెడికల్ కాలేజీల రౖపైవేటీకరణ నిర్ణయం చంద్రబాబు సర్కార్ చారిత్రక తప్పిదమని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు అన్నారు. అధికారం ఉందన్న అహంకారంతో చంద్రబాబు పేదలకు అందే వైద్య విద్య, వైద్యాన్ని దూరం చేయాలని చూస్తున్నారన్నారు. తన ప్రైవేటు తొత్తులకు కట్టబెట్టేందుకు ఈ పీపీపీ విధానాన్ని తెరపైకి తీసుకువచ్చారని తెలిపారు. ఈ నిర్ణయంతో పేదలకు వైద్య విద్య దూరమవుతుందని, వైద్యం కూడా అందకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే మెడికల్ కాలేజీల రౖపైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించిందన్నారు. ప్రభుత్వం మెడలు వంచైనా మెడికల్ కాలేజీలను ప్రభుత్వంలోనే కొనసాగేలా ఈ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలన్నారు. చంద్రబాబు అహంకారాన్ని ప్రజలే దించుతారన్నారు.


