రాయ్‌పూర్ విజయం
విశాఖ స్పోర్ట్స్ : రైల్వే గ్రౌండ్స్‌లో సోమవారం రాత్రి ఫ్లడ్‌లైట్ల వెలుతురులో జరిగిన డీఆర్‌ఎం కప్ ఆహ్వాన ఫుట్‌బాల్ టోర్నీ మ్యాచ్‌లో రాయ్‌పూర్ (ఎస్‌ఈసీఆర్) జట్టు సంబల్‌పూర్ రైల్వే జట్టుపై విజయం సాధించింది. ఏ పూల్‌లో భాగంగా జరిగిన ఈ మ్యాచ్ నిర్ణీత సమయంలో ఇరు జట్లు రెండేసి గోల్స్ చేసి సమానంగా నిలిచాయి. దీంతో విజేతను నిర్ణయించేందుకు టైబ్రేకర్‌ను నిర్వహించగా, రాయ్‌పూర్ జట్టు విజయాన్ని అందుకుంది. ఈ ఆహ్వాన ఫుట్‌బాల్ టోర్నీలో మొత్తం 14 జట్లు రెండు పూల్స్‌లో పోటీపడుతున్నాయి.


