వీఐపీ రోడ్డులో సౌత్ ఇండియా షాపింగ్‌మాల్ ప్రారంభం
బీచ్‌రోడ్డు: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో తన కార్యకలాపాలను విస్తరిస్తున్న సౌత్ ఇండియా షాపింగ్ మాల్, విశాఖలోని వీఐపీ రోడ్‌లో తన 38వ షోరూమ్‌ను ఘనంగా ప్రారంభించింది. ప్రముఖ సినీతార కీర్తి సురేష్ జ్యోతిని వెలిగించి నూతన షోరూమ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైవిధ్యభరితమైన కలెక్షన్లతో ఈ షోరూమ్ పండగ వాతావరణాన్ని ముందుగానే తీసుకువచ్చిందని, ఇది ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఆర్.ఎస్. బ్రదర్స్ రిటైల్ ఇండియా లిమిటెడ్ డైరెక్టర్లు వైజాగ్ ప్రజలకు స్వాగతం పలుకుతూ కుటుంబంలోని అన్ని తరాల వారి అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన వస్త్రాలను సరసమైన ధరలకు అందజేస్తామని హామీ ఇచ్చారు. సంస్థ చైర్మన్ పొట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఈ షోరూమ్ ద్వారా 38వ మైలురాయిని చేరుకోవడం ఆనందదాయకమని, వైజాగ్ వాసుల అభిరుచులను ప్రతిబింబించే వైరెటీలను అందిస్తామని చెప్పారు. మేనేజింగ్ డైరెక్టర్ సీర్ణ రాజమౌళి మాట్లాడుతూ రాబోయే పండుగలకు మరింత శోభనిచ్చే షాపింగ్ అనుభూతిని ఈ కొత్త షోరూమ్ తప్పకుండా అందజేస్తుందని హామీ ఇచ్చారు. హోల్‌టెం డైరెక్టర్ తిరువీధుల ప్రసాదరావు మాట్లాడుతూ, క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి వేడుకలకు అనువైన అన్ని రకాల వైరెటీలు తమ షోరూమ్‌లో సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. వైజాగ్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్‌లో సంప్రదాయం మొదలుకుని సరికొత్త ఫ్యాషన్లను మేళవిస్తూ, పండగ చీరెలు, పట్టు వైరెటీలు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్, ఎథ్నిక్ వేర్, ఇండో–వెస్ట్రన్ కేటగిరీల కలెక్షన్లు అందుబాటులో ఉన్నాయి. కార్యక్రమంలో మేయర్ పీలా శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ శ్రీనివాస్, గణబాబు పాల్గొన్నారు.


