నేడు ఏపీ పీఆర్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం ఎన్నికలు
మహరాణిపేట: ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం, జెడ్పీ యూనిట్ ఎన్నికలు సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి జరగనున్నాయి. జెడ్పీ ప్రాంగణంలోని పీఆర్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం భవనంలో నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని ఎన్నికల అధికారి డి. సీతారామరాజు ఒక ప్రకటనలో తెలియజేశారు. జెడ్పీ, పీఆర్, ఆర్‌డబ్ల్యూఎస్ విభాగాలలో పనిచేస్తున్న మినిస్టీరియల్ ఉద్యోగులందరూ ఈ ఎన్నికల్లో తప్పనిసరిగా పాల్గొనవలసిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ ఎన్నికలకు పరిశీలకులుగా రిటైర్డు ఎంపీడీవో యు. కుర్మారావు వ్యవహరించనున్నారు.


