విశేష స్పందన | - | Sakshi
Sakshi News home page

విశేష స్పందన

Dec 15 2025 6:51 AM | Updated on Dec 15 2025 6:51 AM

విశేష

విశేష స్పందన

‘సాక్షి’ స్పెల్‌ బీ సెమీ ఫైనల్స్‌కు

సీతంపేట: ‘సాక్షి’ మీడియా ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ‘స్పెల్‌ బీ 2025–26’ సెమీఫైనల్‌ పోటీలకు విశేష స్పందన లభించింది. సీతమ్మధార నార్త్‌ ఎక్స్‌టెన్షన్‌లోని శ్రీవిశ్వ స్కూల్‌లో ఆదివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నాలుగు కేటగిరీల్లో ఈ పోటీలు జరిగాయి. రీజనల్‌ లెవెల్‌లో జరిగిన ఈ పోటీల్లో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి పలు పాఠశాలలకు చెందిన 120 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటారు. ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు విద్యార్థులకు నాలుగు కేటగిరీల్లో పోటీలు నిర్వహించారు. 40 నిమిషాల వ్యవధితో, 40 మార్కులకు ఈ పరీక్ష జరిగింది. ఇందులో గెలుపొందిన విజేతలు హైదరాబాద్‌లో జరగనున్న ఫైనల్‌ పోటీల్లో పాల్గొంటారు. ఈ పోటీలకు ‘డ్యూక్స్‌ వేఫీ’ప్రధాన స్పాన్సర్‌గా, ‘ట్రిప్స్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌(రాజమండ్రి)’అసోసియేట్‌ స్పాన్సర్‌గా వ్యవహరించారు. విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసేలా ‘సాక్షి’ స్పెల్‌ బీ పోటీలు దోహదపడుతుండటంతో.. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు స్వయంగా పిల్లలను పరీక్ష కేంద్రాలకు తీసుకువచ్చారు. దీంతో శ్రీవిశ్వ స్కూల్‌ ఆవరణ సందడిగా మారింది. ఈ పోటీలను ‘సాక్షి’ విశాఖ బ్రాంచి మేనేజర్‌ వి.వి.ఎస్‌.చంద్రరావు పర్యవేక్షించగా, శ్రీ విశ్వ విద్యాసంస్థల చైర్మన్‌ కె.ధర్మరాజు, డైరెక్టర్‌ పి.సూర్యనారాయణ పాల్గొన్నారు.

భాషా నైపుణ్యాలు

మెరుగుపడతాయి

‘సాక్షి’స్పెల్‌ బీ పోటీలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. గతంలో కూడా ఒకసారి హాజరయ్యాను. స్పెల్‌ బీ వల్ల ఉచ్చారణ, భాషాజ్ఞానం పెరుగుతాయి. కొత్త పదాలు తెలుస్తాయి. ప్రతి విద్యార్థి ఇందులో పాల్గొనడం వల్ల, ముఖ్యంగా తెలుగు మాధ్యమం విద్యార్థులు తమ ఇంగ్లిష్‌ స్పెల్లింగ్‌ నైపుణ్యాలను మెరుగుపర్చుకోవచ్చు.

– పి.జీవన్‌ కుషాల్‌, వేపగుంట

క్రమం తప్పకుండా పోటీలు

విద్యార్థుల్లో ఆంగ్ల భాషా నైపుణ్యాలు పెంపొందించేలా ‘సాక్షి’మీడియా ఏటా స్పెల్‌బీ, మ్యాథ్స్‌బీ పోటీలు నిర్వహిస్తోంది. ఈసారి సెమీఫైనల్‌ పోటీలకు మా పాఠశాల వేదిక కావడం సంతోషంగా ఉంది. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల నుంచి విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇటువంటి పోటీల వల్ల ఇంగ్లిష్‌, మ్యాథ్స్‌లో వారు మరింత పట్టు సాధించగలరు. తల్లిదండ్రులు తమ పిల్లలను ఇటువంటి పోటీల్లో పాల్గొనేలా ప్రోత్సహించాలి.

– ఎ.ఆర్‌.కె.శివాజీ, డైరెక్టర్‌, శ్రీవిశ్వ స్కూల్‌

ఇంగ్లిష్‌పై పట్టు

సాధించవచ్చు

‘సాక్షి’పేపర్‌లో ప్రకటన చూసి, మా స్కూల్‌ టీచర్లు చెప్పడంతో పలాస నుంచి స్పెల్‌ బీ సెమీఫైనల్‌ పోటీలకు హాజరయ్యాను. ఇంగ్లిష్‌ పదాల ఉచ్చారణ, కొత్త పదాలు నేర్చుకున్నాను. ఇంగ్లిష్‌ వకాబులరీ, ఫోనిక్స్‌, సౌండ్స్‌పై అవగాహన పెంచుకుని భాషపై పట్టు సాధించడానికి ‘సాక్షి’నిర్వహించిన ఈ పోటీలు ఎంతగానో సహాయపడతాయి.

– దాసరి తేజేశ్వరరావు, 8వ తరగతి, పలాస

ఫైనల్స్‌కు వెళ్తానన్న నమ్మకం ఉంది

నేను శ్రీకాకుళంలో 8వ తరగతి చదువుతున్నాను. ఇప్పటి వరకు నిర్వహించిన రౌండ్లలో గెలుపొంది, ఇప్పుడు సెమీ ఫైనల్‌ పోటీకి చేరుకోవడం ఆనందంగా ఉంది. ఇంగ్లిష్‌ నైపుణ్యాలు మెరుగుపర్చుకోవడానికి స్పెల్‌ బీ ఎంతో ఉపయోగపడుతుంది.

– రౌతు చైతన్య, 8వ తరగతి, శ్రీకాకుళం

విశేష స్పందన1
1/7

విశేష స్పందన

విశేష స్పందన2
2/7

విశేష స్పందన

విశేష స్పందన3
3/7

విశేష స్పందన

విశేష స్పందన4
4/7

విశేష స్పందన

విశేష స్పందన5
5/7

విశేష స్పందన

విశేష స్పందన6
6/7

విశేష స్పందన

విశేష స్పందన7
7/7

విశేష స్పందన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement