అబ్బాయిలో సానుకూల మార్పు వస్తోంది
మా అబ్బాయికి ఏడీహెచ్‌డీ, ఆటిజం సమస్యలు ఉన్నాయని గుర్తించి, వైద్యుల సూచన మేరకు స్కేటింగ్‌లో చేర్పించాం. 8 ఏళ్లుగా సాధన చేస్తున్నాడు. క్రీడలను బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనడం ఇది మూడోసారి. గతంలో గోల్డ్, సిల్వర్ మెడల్స్ సాధించాడు. శారీరక వయసు 14 ఏళ్లు అయినా, మానసిక వయసు 8 ఏళ్లే. కానీ క్రీడల వల్ల ఇప్పుడు అందరితో కలవడం, మాట్లాడటం, ఇతరుల భావాలను అర్థం చేసుకోవడం అలవాటు చేసుకున్నాడు.
– ఎం.నరసింహరాజు, క్రీడాకారుడి తండ్రి


