కనకమహాలక్ష్మి సేవలో నటి శ్రీలీల
డాబాగార్డెన్స్: సినీ నటి శ్రీలీల ఆదివారం విశాఖ ఇలవేల్పు శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో ఆమెకు స్వాగతం పలికిన అర్చకులు.. ఆలయ సంప్రదాయం ప్రకారం అమ్మవారికి విశేష పూజలు చేయించారు. అనంతరం వేద పండితులు ఆమెకు ఆశీర్వచనం అందించగా, ఆలయ ఈవో శోభారాణి అమ్మవారి శేషవస్త్రాలను, తీర్థ ప్రసాదాలను అందజేశారు.
అప్పన్న సన్నిధిలో శ్రీలీల
సింహాచలం : శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని ఆదివారం సినీ నటి శ్రీలీల దర్శించుకున్నారు. ఆలయంలోని కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. అంతరాలయంలో అర్చకులు అష్టోత్తరంపూజ నిర్వహించారు. వేద ఆశీర్వచనం అందజేశారు. ఆలయ సంప్రదాయం ప్రకారం ప్రసాదం, శేషవస్త్రాలను సూపరింటిండెంట్ సత్య శ్రీనివాస్ అందజేశారు.


