సరకు రవాణాలో వాల్తేర్ డివిజన్ సరికొత్త రికార్డు
తాటిచెట్లపాలెం: ఈస్ట్‌కోస్ట్ రైల్వే, వాల్తేరు డివిజన్ సరకు లోడింగ్‌లో గత రికార్డులను అధిగమించి కొత్త మైలురాయిని చేరుకుంది. డివిజనల్ రైల్వే మేనేజర్ లలిత్ బోహ్ర ఈ విషయాన్ని తెలిపారు. శుక్రవారం వాల్తేరు డివిజన్ సరకు లోడింగ్ అన్‌లోడింగ్‌లో 100 మిలియన్ టన్నుల మార్కును చేరుకుందని శనివారం మీడియాకు వివరించారు. గతంలో 288 రోజుల్లో చేరుకున్న ఈ రికార్డును ఈసారి కేవలం 256 రోజుల్లోనే పూర్తిచేసి రికార్డు సృష్టించింది. ఈ ఘనత సాధించడంలో కృషి చేసిన ఆపరేషన్స్, కమర్షియల్, మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్ ఇంజనీరింగ్ సహా అన్ని విభాగాల సిబ్బందిని, అలాగే సహకరించిన కస్టమర్లను, భాగస్వాములను డీఆర్‌ఎం లలిత్ బోహ్ర అభినందించారు.


