కనుల పండువగా శ్రీవారి కల్యాణం
పీఎం పాలెం: రెండు రోజులుగా జరుగుతున్న చైతన్య అన్నమయ్య మ్యూజిక్ అసోసియేషన్ సంగీత ఉత్సవాలు శనివారం రాత్రితో ముగిశాయి. ముగింపు సందర్భంగా శ్రీ వేంకటేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవాన్ని కమనీయంగా నిర్వహించారు. నగరంలోని అధిక సంఖ్యలో భక్తులు ఈ కల్యాణానికి హాజరయ్యారు. అన్నమయ్య 12వ తరానికి చెందిన శ్రీమాన్ హరినామాచార్యులు హాజరు కావడం ప్రత్యేకత సంతరించుకుంది. గోపినాంబల శేషాచార్య స్వామి వివాహ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. కల్యాణం సందర్భంగా టీటీడీ ఏ గ్రేడ్ ఆస్థాన గాయకులు బి. రంగనాథ్, కె. సాయిశంకర్ అన్నమయ్య కీర్తనలను అత్యంత మధురంగా ఆలపించారు, కార్యక్రమానికి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, వైజాగ్ కన్వెన్షన్ ఎండీ నరసింహారావు పాల్గొన్నారు.


