లక్కీ షాపింగ్‌మాల్ ప్రారంభం
15వ స్టోర్‌ను ప్రారంభించిన అనసూయ
డాబాగార్డెన్స్: దక్షిణ భారతదేశంలో పేరుగాంచిన లక్కీ షాపింగ్ మాల్ తమ 15వ స్టోర్‌ను శనివారం విశాఖలో ప్రారంభించింది. ప్రముఖ సినీ నటి అనసూయ భరద్వాజ్ జ్యోతి ప్రజ్వలన చేసి నూతన షోరూమ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా నటి అనసూయ మాట్లాడుతూ లక్కీ షాపింగ్ మాల్ నాణ్యమైన దుస్తులను సరసమైన ధరలకే విక్రయించడం ద్వారా కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా ఫ్యాషన్ ప్రపంచంలో నిలుస్తోందని ప్రశంసించారు. షోరూమ్ అధినేతలు రత్తయ్య, శ్రీను, స్వామి మాట్లాడుతూ కస్టమర్ల నమ్మకమే తమకు ఈ మైలురాయి అని, నాణ్యతతో పాటు బడ్జెట్ ధరల్లో ఉత్తమ సేవలు, వస్త్రాలు అందిస్తామని తెలిపారు. ఫ్యామిలీ కలెక్షన్స్‌లో లేడీస్ వేర్, మెన్స్ వేర్, శారీస్, లెహంగాస్, టీ షర్ట్స్ వంటి అపరిమిత కలెక్షన్లు అందుబాటులో ఉన్నాయని వివరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, గణబాబు, సీఎంఆర్ అధినేత మావూరి వెంకటరమణ, కంకటాల అధినేత కంకటాల మల్లిక్, పైడా కృష్ణప్రసాద్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.


