నేడు లోక్ అదాలత్
విశాఖలీగల్: ఉమ్మడి విశాఖలో శనివారం జరగనున్న జాతీయ లోక్ అదాలత్ కోసం ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి చిన్నంశెట్టి రాజు తెలిపారు. కేసుల రాజీ కోసం మొత్తం 39 బెంచీలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. విశాఖ నగరంతోపాటు గాజువాక, అనకాపల్లి, ఎలమంచిలి, చోడవరం, నర్సీపట్నం, పాడేరు, అరకు, చింతపల్లి ప్రాంతాల్లో కూడా లోక్ అదాలత్ బెంచ్‌లు పనిచేస్తాయన్నారు. పదివేలకు పైగా కేసులు పరిష్కరించే అవకాశం ఉందని న్యాయ సేవ ప్రాధికార సంస్థ కార్యదర్శి ఆర్.సన్యాసినాయుడు వెల్లడించారు. క్రిమినల్ కంపౌండబల్ కేసులు, ఎకై ్సజ్ కేసులు, బ్యాంక్ రికవరీ, మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్, ఫ్యామిలీ సివిల్ తదితర కేసులను సామరస్యంతో పరిష్కరించాలన్నారు. పోలీసు స్టేషన్లలో పెండింగ్‌లో ఉన్న కంపౌండబుల్ నేరాలు ఎకై ్సజ్ కేసులను గుర్తించి పార్టీలకు నోటీసులు జారీ చేయాలని పోలీసు, ఎకై ్సజ్ అధికారులకు సూచించారు.


