‘ఇండిగో’ ఇబ్బందుల్ని సమర్ధంగా ఎదుర్కొన్నాం
విశాఖ ఎయిర్‌పోర్టు డైరెక్టర్ ఎన్.పురుషోత్తం
గోపాలపట్నం: ఇండిగో సంక్షోభంలో విశాఖ నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా చర్యలు చేపట్టామని విశాఖ ఎయిర్‌పోర్టు డైరెక్టర్ ఎన్ పురుషోత్తం అన్నారు. ఈ మేరకు విశాఖ విమానాశ్రయంలో బుధవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. దేశ వ్యాప్తంగా ఇండిగో విమానాల రద్దు సమయంలో విశాఖ విమానాశ్రయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి, చాలా మంది ప్రయాణికులు ఎయిర్‌పోర్టుకు రాకముందే విమానాల పరిస్థితిని వివరించగలిగామన్నారు.
బుధవారం రద్దయిన విమానాలు
బుధవారం కూడా 618/307 హైదరాబాద్ విశాఖ హైదరాబాద్, 217/218 బెంగళూరు–విశాఖ–బెంగళూరు, 581/881 చైన్నె–విశాఖ–చైన్నె, 208/783 హైదరాబాద్–విశాఖ–హైదరాబాద్, 6679/6680 ఢిల్లీ–విశాఖ–ఢిల్లీ, 6285/6286 హైదరాబాద్–విశాఖ–హైదరాబాద్ విమాన సర్వీసులు రద్దయినట్లు వెల్లడించారు.


