సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన
మహారాణిపేట: ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 12న జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో సంబంధిత ఏర్పాట్లను కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ పరిశీలించారు. జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్‌తో కలిసి మధురువాడ ఐటీ హిల్స్‌ను సందర్శించిన ఆయన అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను గమనించారు. కాగ్నిజెంట్ కంపెనీకి శంకుస్థాపన చేయనున్న ప్రాంతంలోను, వీఈఆర్(వైజాగ్ ఎకనామిక్ రీజియన్) సమావేశం జరగనున్న ప్రాంతాల్లో అధికారులతో మాట్లాడారు. హిల్ నెం.3 వద్ద హెలిప్యాడ్‌ను పరిశీలించారు. ఆయన వెంట ఏపీఐఐసీ అధికారులు, కాగ్నిజెంట్ ప్రతినిధులు ఉన్నారు.


