నేడు వైఎస్సార్‌సీపీ కార్యాలయానికి సంతకాల పత్రాలు
విశాఖ సిటీ : ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన సంతకాల సేకరణ పత్రాలను బుధవారం అన్ని నియోజకవర్గాల నుంచి ప్రత్యేక వాహనాల్లో జిల్లా పార్టీ కార్యాలయంలో అందజేస్తున్నట్లు వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు తెలిపారు. పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు జరుగుతున్న కోటి సంతకాల కార్యక్రమంలో భాగంగా లక్షల మంది నుంచి సంతకాలు సేకరించినట్లు పేర్కొన్నారు. జిల్లాలో అన్ని నియోజకవర్గాల నుంచి ర్యాలీగా బయలుదేరి ఉదయం 10.30 గంటలకు మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో వాటిని అందజేస్తారని వెల్లడించారు. కార్యక్రమంలో పార్లమెంట్, శాసన మండలి సభ్యులు, మాజీ ఎమ్మెల్యేలు, సీఈసీ, ఎస్‌ఈసీ సభ్యులు, రాష్ట్ర, జోనల్, జిల్లా అనుబంధ అధ్యక్షులు, కార్పొరేటర్లు, జెడ్పీటీసీ, ఎంపీపీలు, మండల, వార్డు అధ్యక్షులు, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ కమిటీ సభ్యులు, వార్డు కమిటీ, అనుబంధ కమిటీలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హాజరు కావాలని పిలుపునిచ్చారు.
ప్రతి నియోజకవర్గం నుంచి ర్యాలీగా..
● భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు(చిన్న శ్రీను) ఆధ్వర్యంలో తగరపువలస అంబేడ్కర్ విగ్రహం నుంచి వైఎస్సార్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి అక్కడి నుంచి జిల్లా పార్టీ కార్యాలయానికి వస్తారు.
● విశాఖ తూర్పు సమన్వయకర్త మొల్లి అప్పారావు ఆధ్వర్యంలో హెచ్‌బీ కాలనీలో ఉన్న నియోజకవర్గ పార్టీ కార్యాలయం నుంచి..
● దక్షిణ సమన్వయకర్త వాసుపల్లి గణేష్‌కుమార్ ఆధ్వర్యంలో ఆశీల్‌మెట్ట ఆశోక్‌నగర్‌లో గల నియోజకవర్గ పార్టీ కార్యాలయం నుంచి..
● ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త కేకే రాజు ఆధ్వర్యంలో పోర్డ్ స్టేడియం వెనుక గేటు నుంచి ..
● పశ్చిమ సమన్వయకర్త మళ్ల విజయ్‌ప్రసాద్ ఆధ్వర్యంలో మింది గల నియోజకవర్గ పార్టీ కార్యాలయం నుంచి..
● గాజువాక సమన్వయకర్త తిప్పల శ్రీనివాస్ దేవన్ రెడ్డి ఆధ్వర్యంలో పాత గాజువాక జంక్షన్ నుంచి జిల్లా పార్టీ కార్యాలయానికి వస్తారు.
నియోజకవర్గాల నుంచి ర్యాలీగా బయలుదేరి పార్టీ జిల్లా కార్యాలయంలో అందజేత


