మైనింగ్ మాఫియా
నేరేళ్లవలసతో
అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు
280 లారీలతో అక్రమ రవాణా
టీడీపీ నేత బరితెగింపు..
చోద్యం చేస్తున్న యంత్రాంగం
భీమిలిలో
విశాఖ సిటీ : టీడీపీ నేతల అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ప్రభుత్వ భూములతో పాటు కొండలను సైతం చెరబడుతున్నారు. భూ కబ్జాలు, అక్రమ ఇసుక తవ్వకాలు, అనధికార మైనింగ్ కార్యకలాపాలకు పాల్పడుతూ రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. తాజాగా భీమిలి నియోజకవర్గంలో మైనింగ్ మాఫియా రెచ్చిపోతోంది. నేరేళ్లవలసలో అక్రమంగా గ్రావెల్‌ను తరలించుకుపోతోంది. లారీల రాకపోకలకు వీలుగా 300 మీటర్ల మేర ప్రత్యేకంగా రహదారిని నిర్మించుకుని మరీ గ్రావెల్ రవాణా చేస్తోంది. నిత్యం రాత్రి సమయాల్లో వందల లారీల్లో అక్రమంగా గ్రావెల్ తరలిపోతున్నా అధికార యంత్రాంగం పట్టనట్లు వ్యవహరించడం అనేక అనుమానాలకు తావిస్తోంది.
టీడీపీ నేత కనుసన్నల్లోనే..
టీడీపీ నేతలు కొండలు, భూములను సైతం విడిచిపెట్టడం లేదు. కొండ తవ్వకాలతో ఇబ్బందులు వ స్తాయని భావించిన నేత ఏకంగా మైదాన భూముల్లో సైతం మైనింగ్ చేసేస్తున్నాడు. భీమిలి మండలం నేరేళ్లవలస గ్రామం సర్వే నెంబర్–4లో కొండ పోరంబోకు స్థలంలో అక్రమార్కులు గ్రావెల్ తవ్వకాలు చేపడుతున్నారు. భీమిలి కోఆపరేటివ్ సొసైటీ భూముల వెనుక నుంచి లారీల రాకపోకలకు వీలుగా ప్రత్యేకంగా రోడ్డును సైతం ఏర్పాటు చేసుకున్నారు. నిత్యం జేసీబీలతో గ్రావెల్‌ను 280 లారీల్లో లోడ్ చేస్తూ ఇక్కడి నుంచి తరలించుకుపోతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. అటువైపుగా ఎవరూ వెళ్లకుండా ప్రత్యేకంగా ప్రైవేటు సైన్యాన్ని సైతం ఏర్పాటు చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
రూ.3 కోట్ల విలువైన గ్రావెల్ తరలింపు
గత కొద్ది రోజులుగా యథేచ్ఛగా గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ.. ఎవరూ అటువైపు కన్నెత్తి చూడడం లేదని వాపోతున్నారు. నిత్యం వందల లారీలు తిరుగుతున్నాయని, ఇప్పటి వరకు రూ.3 కోట్లు విలువైన గ్రావెల్ తవ్వకాలు జరిగినట్లు చెబుతున్నారు. ఈ మొత్తం వ్యవహారమంతా టీడీపీ నేత మోరపూడి శ్రీనివాస్ కనుసన్నల్లోనే జరుగుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. అతడికి ప్రజాప్రతినిధుల అండదండలు ఉండడం కారణంగా మైనింగ్, పోలీస్, విజిలెన్స్, రెవెన్యూ శాఖల అధికారులు పట్టించుకోవడం లేదన్న వార్తలు గుప్పుమంటున్నాయి.
లారీల రాకపోకలకు వీలుగా రహదారి నిర్మాణం
మైనింగ్ మాఫియా


