రెండు వర్గాలకూ ప్రయోజనం
ఈ ఆన్‌లైన్ విధానం ఇటు రైతులకు, అటు వినియోగదారులకు ఎంతో ఉపయోగకరం. వినియోగదారులకు తాజా ఉత్పత్తులను అందిస్తూనే, రైతుల ఆర్థికాభివృద్ధికి బాటలు వేయాలన్నదే మార్కెటింగ్ శాఖ లక్ష్యం. వినియోగదారులు ఇంట్లోనే ఉండి రైతుబజార్ ధరలకే నాణ్యమైన కూరగాయలు పొందవచ్చు. దీని వల్ల రైతులకు కూడా మంచి మార్కెట్ లభిస్తుంది. ప్రస్తుతం వెబ్‌సైట్ ద్వారా సేవలు అందుతుండగా, త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా డిజి రైతుబజార్ ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తేనున్నాం. వినియోగదారులు గూగుల్ ప్లే స్టోర్ నుంచి దీన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
– శ్రీనివాస కిరణ్, డీడీ, మార్కెటింగ్ శాఖ


