రోజుకు 50 ఆర్డర్లు వస్తున్నాయి..
వ్యవసాయ మార్కెటింగ్ శాఖ, మా మెషెంట్ సొల్యూషన్స్ సంస్థ సంయుక్తంగా ఈ సేవలను అందిస్తున్నాయి. మార్కెటింగ్ శాఖ సూచనల మేరకు ఎంవీపీకాలనీ రైతు బజార్‌ను పైలట్ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేసుకున్నాం. మా సంస్థ తరపున ఇద్దరి నుంచి ముగ్గురు ఆర్డర్లను పర్యవేక్షిస్తున్నారు. మైబాక్స్ డెలివరీ పార్ట్నర్స్ ద్వారా సరకులను వినియోగదారులకు చేరవేస్తున్నాం. ప్రస్తుతం రోజుకు 40 నుంచి 50 ఆర్డర్లు వస్తున్నాయి. ఆర్డర్ వచ్చిన గంటలోపే డెలివరీ చేస్తున్నాం. ఈ సేవలను ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్తే ఆర్డర్ల సంఖ్య భారీగా పెరిగే అవకాశముంది
– శాస్త్రి వేలమూరి, సీనియర్ అసోసియేట్, మెషెంట్ సొల్యూషన్స్


