సీనియర్ న్యాయవాదికి మాతృవియోగం
అల్లిపురం: ప్రముఖ న్యాయవాది నల్లమిల్లి శ్రీవెంకటరెడ్డి మాతృమూర్తి నల్లమిల్లి భానుమతి (75) కన్నుమూశారు. అనారోగ్యంతో కాకినాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున ఆమె తుదిశ్వాస విడిచారు. భానుమతి మృతి పట్ల విశాఖపట్నం బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ఎం.కె.శ్రీనివాసరావు, లాలం పార్వతి నాయుడుతో పాటు కార్యవర్గ సభ్యులు, బార్ కౌన్సిల్ సభ్యుడు నర్సింగరావు, సీనియర్ న్యాయవాది ఎండీ హబీబుల్లా తదితర న్యాయవాదులు సంతాపం వ్యక్తం చేశారు. బుధవారం ఉదయం 9 గంటలకు అక్కయ్యపాలెం 80 అడుగుల రోడ్డులోని చిన్నమసీదు నుంచి ఆమె అంతిమయాత్ర ప్రారంభమవుతుందని శ్రీవెంకటరెడ్డి తెలిపారు.


