సందడిగా బాలోత్సవం
ఆకట్టుకున్న చిన్నారులు
డాబాగార్డెన్స్: సెయింట్ ఆంథోనీ తెలుగు మీడియం ప్రైమరీ స్కూల్ వేదికగా మంగళవారం ‘బాలోత్సవం’అట్టహాసంగా ప్రారంభమైంది. ఉత్సవాల్లో పాల్గొన్న చిన్నారులతో పాఠశాల ప్రాంగణం సందడిగా మారింది. ముందుగా జిల్లా విద్యాశాఖాధికారి ఎన్.ప్రేమ్‌కుమార్ జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒకే వేదికపై ఇంతమంది పిల్లలను చూడటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. రోటరీ ఇంటర్నేషనల్ (3020 డిస్ట్రిక్ట్) గవర్నర్ డాక్టర్ వై.కల్యాణ చక్రవర్తి మాట్లాడుతూ.. రోటరీ సంస్థ సేవాభావంతో పనిచేస్తోందన్నారు. విద్యార్థులను సేవా కార్యక్రమాల వైపు ప్రోత్సహించేందుకు ఇంటరాక్ట్, రోటరాక్ట్ క్లబ్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఆసరా చారిటబుల్ సొసైటీ ప్రతినిధి శ్రీనాథ్ మాట్లాడుతూ.. పిల్లలు తమ చుట్టూ జరిగే విషయాలను నిశితంగా పరిశీలించాలన్నారు. పాఠశాల కరస్పాండెంట్, ఫాదర్ పి.రత్నకుమార్ మాట్లాడుతూ తమ పాఠశాల ఇంత గొప్ప కార్యక్రమానికి ఆతిథ్యం ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. పిల్లలకు ఇలాంటి పోటీలు మేలు చేస్తాయని రోటరీ విశాఖ వ్యాలీ చైర్మన్ ఎం.వి. జానకిరామ్, డాక్టర్ పీకే జోస్ అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో భాగంగా తొలి రోజు నిర్వహించిన అకడమిక్, కల్చరల్ పోటీలు ఉత్సాహంగా సాగాయి. సబ్ జూనియర్స్, జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో నిర్వహించిన ఈ పోటీల్లో పిల్లలు పెద్ద ఎత్తున పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. కార్యక్రమంలో నరవ ప్రకాశరావు, రోటరీ క్లబ్ విశాఖ అధ్యక్షుడు రఘుపతి, ఇన్నర్ వీల్ క్లబ్ అధ్యక్షుడు దీపా జేలోకా, బాలోత్సవం ఆహ్వాన సంఘం సభ్యులు పాల్గొన్నారు.
సందడిగా బాలోత్సవం
సందడిగా బాలోత్సవం


