ఘనంగా కేకే రాజు జన్మదిన వేడుకలు
మద్దిలపాలెం: వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కె.కె. రాజు పుట్టినరోజు వేడుకలు మద్దిలపాలెంలో ఘనంగా జరిగాయి. పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం జరిగిన వేడుకల్లో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని కేకే రాజుకు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ కేడర్ ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేసి అభిమానులకు పంపిణీ చేశారు. జిల్లా పరిధిలోని అన్ని నియోజకవర్గాల నుంచి పార్టీ కార్యకర్తలు, నాయకులు, మహిళలు, అభిమానులు అధిక సంఖ్యలో కోలాహలంగా తరలివచ్చి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్, పసుపులేటి బాలరాజు, ఎమ్మెల్సీలు కుంభా రవిబాబు, వరుదు కల్యాణి, మాజీ ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్ కుమార్, తైనాల విజయకుమార్, తిప్పల నాగిరెడ్డి, చింతలపూడి వెంకటరామయ్య, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త మొల్లి అప్పారావు, గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డి, నగర మాజీ మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, జీవీఎంసీ డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్, జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అల్లు శంకరరావుతో పాటు పలువురు కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని కె.కె. రాజుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.


