నేడు ప్రాంతీయ ఔషధ ప్రయోగశాల ప్రారంభం
ఆరిలోవ: విశాఖలో ప్రాంతీయ ఔషధ పరీక్షల ప్రయోగశాలను మంగళవారం ప్రారంభించనున్నారు. విశాఖ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఆవరణలో ఈ ప్రాంతీయ ఔషధ పరీక్షల ప్రయోగశాల, ఔషధ నియంత్రణ అండ్ పరిపాలన సంయుక్త సంచాలక కార్యాలయాన్ని నిర్మించారు. ఈ భవనం నిర్మాణం సుమారు ఏడు నెలల క్రితమే పూర్తయింది. అక్టోబర్ 27న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి సత్యప్రసాద్‌తో ప్రారంభించడానికి అధికారులు సన్నాహాలు చేశారు. అదేరోజు మోంథా తుపాను ప్రభావంతో వాయిదా పడింది. మంత్రి నగరానికి ఎప్పుడు వస్తే అప్పుడే ప్రారంభించాలని అధికారులు ఎదురుచూశారు. దీంతో ఈ కార్యాలయం ప్రజలకు అందుబాటులోకి రాకుండా మిగిలిపోయింది. దీనిపై ఈ నెల 4న ‘సాక్షి’లో ‘ఔషధ ప్రయోగశాల ప్రారంభమె ప్పుడో’ శీర్షికతో కథనం ప్రచురితం కావడంతో జిల్లా అధికారులు స్పందించారు. మంత్రి కోసం ఎదురు చూడకుండానే మంగళవారం కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ చేతుల మీదుగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
నేడు ప్రాంతీయ ఔషధ ప్రయోగశాల ప్రారంభం


