రెయిన్‌బో నూతన కేంద్రం ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

రెయిన్‌బో నూతన కేంద్రం ప్రారంభం

Dec 8 2025 7:34 AM | Updated on Dec 8 2025 7:34 AM

రెయిన్‌బో నూతన కేంద్రం ప్రారంభం

రెయిన్‌బో నూతన కేంద్రం ప్రారంభం

అందుబాటులోకి అత్యవసర, ఓపీడీ సేవలు

బీచ్‌రోడ్డు: ప్రముఖ పీడియాట్రిక్‌ మల్టీ స్పెషాలిటీ, పెరినాటల్‌ కేర్‌ ఆసుపత్రి అయిన రెయిన్‌బో చిల్డ్రన్స్‌ హాస్పిటల్‌.. సిరిపురంలోని కై లాసమెట్టలో తమ కొత్త 24/7 చిల్డ్రన్స్‌ ఎమర్జెన్సీ, ఓపీడీ సెంటర్‌ను ప్రారంభించింది. ఈ సెంటర్‌ను నగర పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రత బాగ్చి ప్రారంభించి మాట్లాడారు. చిన్న పిల్లలకు సకాలంలో వైద్యం అందించకపోతే ఆరోగ్యం విషమించే ప్రమాదముందన్నారు. ఇటువంటి క్లిష్టమైన సమయాన్నే వైద్య పరిభాషలో గోల్డెన్‌ అవర్‌గా వ్యవహరిస్తారని తెలిపారు. రెయిన్‌బో చిల్డ్రన్స్‌ హాస్పిటల్‌ ఈ పీడియాట్రిక్‌ అత్యవసర సేవలను ఆరంభించడం ద్వారా నగరంలో పీడియాట్రిక్‌ కేర్‌ సేవలు మరింత విస్తృతమవుతాయన్నారు. ఈ ప్రాంతం అంతటా ఉన్న కుటుంబాలకు సకాలంలో, ప్రత్యేకమైన, సమగ్రమైన పీడియాట్రిక్‌ సంరక్షణను అందించే సామర్థ్యం ఈ కేంద్రానికి ఉందని పేర్కొన్నారు. రెయిన్‌బో హాస్పిటల్‌ సీనియర్‌ కన్సల్టెంట్‌ పీడియాట్రిషియన్‌ డాక్టర్‌ రజిని ముఖర్జీ మాట్లాడుతూ.. సకాలంలో పిల్లలపై దృష్టి సారించి అత్యవసర, అవుట్‌ పేషెంట్‌ సంరక్షణ చికిత్సలను అందించడంలో ఈ కేంద్రం కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. శిక్షణ పొందిన పీడియాట్రిక్‌ నిపుణుల సహకారంతో సమర్థవంతంగా వైద్య సేవలందించేందుకు ఈ కేంద్రం సంసిద్ధంగా ఉందని వివరించారు. డాక్టర్‌ శాశ్వత్‌ మహంతి మాట్లాడుతూ పిల్లల ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను బలోపేతం చేసేందుకే ఈ అత్యవసర, ఓపీడీ సేవలను రూపొందించినట్లు పేర్కొన్నారు. సీనియర్‌ కన్సల్టెంట్‌ గైనకాలజిస్ట్‌ డాక్టర్‌ చుప్పన రాగసుధ మాట్లాడుతూ ఈ సెంటర్‌లోని సేవలకు ‘బర్త్‌ రైట్‌ బై రెయిన్‌బో హాస్పిటల్స్‌’మద్దతు ఇస్తుందన్నారు. మహిళలు, పిల్లల సంరక్షణ, సంతానోత్పత్తిలో ప్రత్యేక సేవలు, ప్రపంచ స్థాయి వైద్య నైపుణ్యం, మెరుగైన ఆరోగ్య ఫలితాలను అందించడమే ఈ కేంద్రం లక్ష్యమని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement