సదరన్, సెంట్రల్ రైల్వే జట్లు చాంపియన్స్
విశాఖ స్పోర్ట్స్ : 72వ ఆలిండియా రైల్వే మెన్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌ను సదరన్ రైల్వే జట్టు కై వసం చేసుకోగా.. 11వ ఆలిండియా రైల్వే వుమెన్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌ను సెంట్రల్ రైల్వే జట్టు సాధించింది. ఈకో రైల్వే క్రీడా సంఘం ఆధ్వర్యంలో విశాఖ రైల్వే స్టేడియం వేదికగా నాలుగు రోజుల పాటు 16 కేటగిరీల్లో మెన్, వుమెన్‌కు నిర్వహించిన పోటీల్లో 17 రైల్వే జట్లు పోటీపడ్డాయి. ముగింపు కార్యక్రమానికి డీఆర్‌ఎం లలిత్ బొహ్రా హాజరై విజేతలకు ట్రోఫీలందించారు. మెన్ చాంపియన్‌షిప్‌లో 190 పాయింట్లతో సదరన్ రైల్వే వెయిట్‌లిఫ్టర్లు విజేతగా నిలవగా 188 పాయింట్లతో నార్తర్న్ రైల్వే రన్నరప్‌గా నిలిచింది. వుమెన్ చాంపియన్‌లో 184 పాయింట్లు సాధించిన సెంట్రల్ రైల్వే వెయిట్‌లిఫ్టర్లు విజేతగా నిలవగా 174 పాయింట్లతో నార్తర్న్ రైల్వే వెయిట్‌లిఫ్టర్లు రన్నరప్‌గా నిలిచారు. వ్యక్తిగత చాంపియన్‌షిప్‌లో మహిళా విభాగంలో కోమల్ కోఫర్(నార్త్ సెంట్రల్ రైల్వే), మెన్ విభాగంలో టి.మాథవన్(నార్త్రన్ రైల్వే) బెస్ట్ లిఫ్టర్లుగా ఎంపికయ్యారు. రైల్వే అధికారులు అజయ్‌శర్మ, బి.శాంతారామ్, కె.రామారావు, ఎం.హరనాథ్ తదితరులు పాల్గొన్నారు.


