మహిళ దారుణ హత్య
సింహాచలం: 98వ వార్డు పరిధి సూర్యకాంతం లేఅవుట్‌లో మహిళ హత్య గురైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెందుర్తి మండలం చినముషిడివాడ సమీపంలోని లక్ష్మీనగర్‌కి చెందిన వనుము శ్రీనివాసరావు (64) విజయనగరానికి చెందిన అల్ల దేవి (35) సహజీవనం చేస్తున్నారు. భార్యభర్తలమని చెప్పి నెలరోజుల క్రితం 98వ వార్డు పరిధి సూర్యకాంతం లేఅవుట్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ అద్దెకు తీసుకుని ఉంటున్నారు. శనివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఇద్దరు పెద్ద ఎత్తున గొడవ పడ్డారు. మహిళా వాచ్‌మెన్ ఫ్లాట్‌కి వెళ్లి ఏమి జరిగిందని అడగ్గా నీకెందుకని కిటికీలో నుంచి శ్రీనివాసరావు సమాధానం ఇచ్చాడు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో శ్రీనివాసరావు ఫ్లాట్‌కి తాళం వేసి బయటికి వెళ్లిపోయాడు. మహిళా వాచ్‌మెన్‌కి అనుమానం వచ్చి ఫ్లాట్‌కి వెళ్లి తలుపుకొట్టింది. ఎంతకీ తలుపు తీయకపోవడంతో అనుమానం వచ్చి మిగతా ఫ్లాట్‌ల వాళ్లకు తెలిపింది. వాళ్లు వెంటనే 112కి సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఫ్లాట్ తలుపులు తెరిచి చూసేసరికి దేవి తలకు తీవ్రగాయాలతో అపస్మారక స్థితిలో ఉంది. వెంటనే కేజీహెచ్‌కి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్మాప్తు చేస్తున్నారు. కాగా శ్రీనివాసరావు ఫ్లాట్‌కి వచ్చినప్పుడు.. వెళ్లేటప్పుడు ముఖానికి హెల్మెట్ పెట్టుకుంటాడని స్థానికులు చెబుతున్నారు. శ్రీనివాసరావు.. దేవి తలపై గట్టిగా కొట్టి హత్య చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.


