ఉత్సాహంగా స్కేటింగ్ పోటీలు
విశాఖ స్పోర్ట్స్ : జాతీయ రోలర్ స్కేటింగ్ చాంపియన్‌షిప్‌లో భాగంగా తొలి మూడు రోజుల పాటు జరగాల్సిన పోటీల్లో తొలి రోజు చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నా రు. అండర్–12 కేటగిరీలో శనివారం వీఎంఆర్డీఏ పార్క్ రింక్‌లో మూడు అంశాల్లో స్పీడ్ రేస్‌లతో పాటు రోలర్ హాకీ పోటీలు జరిగాయి. శివాజీ పార్క్‌లోని రింక్‌లో ఆరిస్టిక్ పోటీల్లో చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. 10–12 ఏళ్ల బాల బాలికలకు ఫిగర్ స్కేటింగ్ పోటీలు, సోలో డ్యాన్స్ పోటీలు జరిగాయి. 6–8 ఏళ్లు, 8–10 ఏళ్ల చిన్నారులకు సోలో డ్యాన్స్ కంపల్సరీ పో టీలు నిర్వహించారు. 10–12 ఏళ్ల చిన్నారులకు క్వాడ్ ఫ్రీ పోటీల్లో చక్కటి ప్రతిభ కనబరిచారు. రాష్ట్ర రోలర్ స్కేటింగ్ సంఘం ఆధ్వర్యంలో తొలి రోజు ప్రాథమిక పోటీలు జరగ్గా బాలబాలికలు పోటీపడ్డారు.


