గని
జనసేనలో అక్రమాల
శరగడం సూర్య ప్రభావతి అనే మహిళ.. తన సతీమణి, జంపపాలెం ఎంపీటీసీ సభ్యురాలు ఉమకు తల్లిగా పేర్కొంటూ 2017 ఏప్రిల్ 21న జంపపాలెం పంచాయతీ నుంచి జారీ చేసినట్టుగా నకిలీ డెత్ సర్టిఫికెట్‌ను సృష్టించుకున్నాడు సదరు జనసేన నేత సిలపరశెట్టి వెంకట గని మహేశ్. వాస్తవానికి ఎంపీటీసీ సిలపరశెట్టి ఉమ తల్లి ఇంకా బతికే ఉన్నట్టు జంపపాలెం గ్రామస్తులు స్పష్టం చేస్తున్నారు. ఈ నకిలీ మరణ ధ్రువ పత్రం ఆధారంగా దేశపాత్రునిపాలెంలో 300 చదరపు గజాల స్థలాన్ని యలమంచిలి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో తన పేరున జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ (జీపీఏ) చేయించుకున్నాడు సదరు ‘గను’డు. అసలు శరగడం సూర్య ప్రభావతి మరణ వివరాలేవీ తమ పంచాయతీ రికార్డుల్లో లేవని.. డెత్ సర్టిఫికెట్ జారీ చేయలేదని.. అధికారులు స్పష్టం చేస్తున్నారు.
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం
ఖాళీ స్థలం కనబడితే చాలు పొలోమని వాలిపోతున్నారు అధికార పార్టీ నేతలు. ముందుగా ఖాళీ స్థల వివరాలు సేకరిస్తారు.. ఆ తరువాత యజమాని ఉన్నది లేనిదీ చూసుకుంటారు. సదరు యజమాని చనిపోయి ఉంటే నకిలీ డెత్ సర్టిఫికెట్‌ను సృష్టించి.. సదరు ఆస్తిని తమ పేరుతో జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ (జీపీఏ) చేయించుకుంటున్నారు. ఒకవేళ వ్యవహారం బయటకు వస్తే ఎలాంటి చర్యలు లేకుండా తమ అధికారాన్ని అడ్డం పెట్టుకుంటున్నారు. యలమంచిలి నియోజకవర్గానికి చెందిన ఓ నేత పక్కన ఉన్న పెందుర్తి నియోజకవర్గంలోని పరవాడ మండలంలో వేలు పెట్టాడు. నకిలీ డెత్ సర్టిఫికెట్ సృష్టించి ఆస్తిని కాజేసే ప్రయత్నం చేశాడు. అయితే, డెత్ సర్టిఫికెట్ కాస్తా నకిలీదని తేలడంతోపాటు.. వ్యవహారంపై ఫిర్యాదు రావడంతో జిల్లా రిజిస్ట్రార్ విచారణ చేసి ప్రాసిక్యూషన్‌కు ఆదేశించారు. అయితే అధికార పార్టీ నేతలు కావడంతో రెండు నెలలు గడుస్తున్నా చర్యలు తీసుకోలేకపోతున్నారు. సదరు అక్రమాల ‘గను’డు దర్జాగా జనసేన కండువా వేసుకుని రోడ్లపై చక్కర్లు కొడుతున్నాడు.
అక్రమాన్ని నిర్ధారించినా...!
జనసేన నేత సిలపరశెట్టి గని మహేశ్ అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారంపై ఈ ఏడాది ఏప్రిల్ 16వ తేదీన అనకాపల్లి జిల్లా రిజిస్ట్రార్‌కు అన్ని ఆధారాలతో గ్రామానికి చెందిన వ్యక్తులు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై సమగ్ర విచారణ జరిపిన జిల్లా రిజిస్ట్రార్ పరవాడ మండలం దేశపాత్రునిపాలెం బాలాజీనగర్ లే అవుట్ సర్వే నెంబర్లు 291–1,2,3,4,5,6, 347–7,11,13, 274–1, 2 లో 300 చదరపు గజాల స్థలాన్ని ఫేక్ డెత్ సర్టిఫికెట్‌తో జనసేన నేత వెంకట గని మహేశ్ తన భార్యతో యలమంచిలి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జీపీఏ చేయించుకున్నట్టు నిర్ధారించారు. తదుపరి లావాదేవీలు జరగకుండా వెంటనే దీనిని మోసపూరిత దస్తావేజుగా రికార్డుల్లో నమోదు చేయాలని యలమంచిలి సబ్ రిజిస్ట్రార్‌ను జిల్లా రిజిస్ట్రార్ ఆదేశించారు. మోసపూరిత దస్తావేజు నమోదు ప్రక్రియలో ప్రమేయం ఉన్న జంపపాలెం ఎంపీటీసీ సిలపరశెట్టి ఉమ (ప్రధాన పాత్రధారి), ఆమె భర్త సిలపరశెట్టి వెంకట గని మహేశ్ (జీపీఏ ఏజెంట్), సాక్షులు కోరిబిల్లి జగదీశ్, ఎస్.నూక అప్పారావులను ప్రాసిక్యూట్ చేయాలని ఈ ఏడాది సెప్టెంబర్ 16న ఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికీ ఇప్పటివరకూ చర్యలు లేకపోవడం వెనుక జనసేన నేతల ఒత్తిళ్లు ఉన్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఎమ్మెల్యేతో జంపపాలెం ఎంపీటీసీ ఉమ
తల్లి పేరు మార్చుకుని..!
ఫేక్ డెత్ సర్టిఫికెట్‌తో విలువైన స్థలం అక్రమ రిజిస్ట్రేషన్
అక్రమాల ‘గను’డు...!
ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న తమకు అక్రమాల్లోనూ భాగస్వామ్యం ఉండాల్సిందే అనే తరహాలో స్థానిక జనసేన నేత వ్యవహారం సాగుతోంది. నియోజకవర్గం కూడా దాటి మరీ... భూ అక్రమాల్లో తలదూర్చడం చర్చనీయాంశమవుతోంది. రియల్ ఎస్టేట్ బ్రోకర్లతో సంబంధాలున్న గని మహేశ్ కన్ను పరవాడ మండలం దేశపాత్రునిపాలెం బాలాజీనగర్ లే అవుట్ సర్వే నెంబర్లు 291–1,2,3,4,5,6, 347–7,11,13, 274–1,2 ప్లాట్ 33లో ఉన్న 300 చదరపు గజాల విలువైన ఖాళీ ఇంటి స్థలంపై పడింది. ఆ స్థలం వివరాలు, యజమాని గురించి ఆరా తీశాడు. శరగడం విశ్వేశ్వరరావు భార్య శరగడం సూర్య ప్రభావతి పేరు మీద ఇంటి స్థలం ఉన్నట్టు గుర్తించాడు. స్థల యజమానురాలు సూర్య ప్రభావతి జాడ గానీ, ఆమె కుటుంబసభ్యులు, వారసుల కదలికలు, వారి తాలుకా మనుషులు ఎవరూ లేరని తెలుసుకోవడంతో మాస్టర్‌ప్లాన్ వేసి, నకిలీ డెత్ సర్టిఫికెట్‌తో ఆ స్థలాన్ని తన పేర అక్రమ రిజిస్ట్రేషన్ చేయించుకోవడం గమనార్హం.
చక్రం తిప్పిన జంపపాలెం ఎంపీటీసీ భర్త గని మహేశ్
క్రిమినల్ చర్యలకు జిల్లా రిజిస్ట్రార్ ఆదేశం
రెండు నెలలు గడుస్తున్నా అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారంలో చర్యలు నిల్
జనసేన ముఖ్యనేతల అండదండలు
గని


