మురళీనగర్: కంచరపాలెం పాలిటెక్నిక్ విద్యార్థులకు ఆన్‌జాబ్ ట్రైనింగ్‌కు సంబంధించి రష్యాకు చెందిన పాలిటెక్నిక్ కాలేజీ శుక్రవారం ఒప్పందం చేసుకుంది. ఇటీవల రష్యా ప్రతినిధులు పాలిటెక్నిక్ కాలేజీని రెండు సార్లు సందర్శించి ఇక్కడి సౌకర్యాలు, ఫ్యాకల్టీ, లేబొరేటరీ, బోధనాభ్యసనంలో టెక్నాలజీ వినియోగాన్ని పరిశీలించారు. ఈ మేరకు విశాఖలో నిర్వహిస్తున్న సీఐఐ సదస్సులో రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ జి.గణేష్‌కుమార్ సమక్షంలో రష్యాకు చెందిన పెర్వరల్‌స్కీ మెటలర్జికల్ కాలేజీ ప్రిన్సిపాల్ ఆంతిపినా ఫెలిస్కోవ్నా, కంచరపాలెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ కె.రత్నకుమార్‌లు ఎంవోయూ పత్రాలు మార్చుకున్నారు.


